నందమూరి నట సింహం బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ ఇతర కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అఖండ చిత్ర యూనిట్.. సుదర్శన్ థియేటర్లో 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో బాలయ్యతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో పాటు నిర్మాత శిరీష్‌తో పాటు పలువురు హాజరయ్యారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి సుదర్శన్‌లో ‘అఖంఢ’ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమాను థియేటర్స్‌లో చూస్తేనే మజా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ‘అఖంఢ’ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ‘అఖండ’ చిత్రంలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌తో పాటు అందరు బాగా చేసారని బాలయ్య మెచ్చుకున్నారు. (Twitter/Photo)
దర్శకుడు బోయపాటి శ్రీను గురించి మాట్లాడుతూ.. ఆ దేవుడే మా ఇద్దరిని కలిపాడని అనుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ ప్రేక్షకులతో పాటు ఆ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు దక్కుతుందన్నారు. కరోనా సమయంలో సినిమా విడుదలైతే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా రానా అనే అనుమానాలను పటా పంచలు చేస్తూ.. ఈ సినిమా సాధించిన విజయం అమోఘం అన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షక దేవుళ్లకు చేతులేత్తి సమస్కారం చేసారు. (Twitter/Photo)
‘అఖంఢ’ 50 రోజుల వేడుక సందర్భంగా థియేటర్లో కేక్ కట్ చేశారు. ఇక ఆర్జీసీ క్రాస్ రోడ్‌కి వస్తుంటే.. మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయన్నారు. స్టూడియోలో నాన్న గారి కోసం టిఫిన్ తీసుకొచ్చే వాడిని అంటూ ఆనాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసారు. అప్పట్లో సుదర్శన్ 70 ఎం ఎం థియేటర్లో ‘సమరసింహారెడ్డి’ శతదినోత్సవ వేడుకకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇపుడు సుదర్శన్ 35 ఎంఎంలో అఖండ శతదినోత్సవ వేడుకకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. (Twitter/Photo)
ప్రకృతి, దేవుడు జోలికి వస్తే దేవుడు ‘అఖండ’ రూపంలో దుష్ట శిక్షణ చేస్తాడనే విషయాన్ని ఈ సినిమాలో ప్రస్తావించినట్టు బాలయ్య చెప్పారు. మరోవైపు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. నందమూరి బాలయ్య నాపై ఉంచిన నమ్మకం మరోసారి నిజమైంది. ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డితో ఈ చిత్రానికి పని చేసిన ప్రతి టెక్నీషియన్‌తో పాటు ప్రేక్షకులకు బోయపాటి శ్రీను కృతజ్ఞతలు తెలిపారు. (Twitter/Photo)
మరోవైపు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. నందమూరి కుటుంబానికి, ప్రేక్షకులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. నేను బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో సినిమా తీస్తానని.. ఆ సినిమా 50 రోజులు ఏకధాటిగా ఆడుతుందని కలగనలేదన్నారు. దాన్ని నిజం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. (Twitter/Photo)
ఈ మధ్య కాలంలో 50 రోజుల పాటు ఇలాంటి జోరు చూపించిన సినిమా మరోటి లేదు. కేవలం తెలుగులోనే కాదు.. మొత్తం భారత దేశంలోనే ఈ రికార్డు సాధించిన ఏకైక హీరో బాలయ్య. హైదరాబాద్, గాజువాక, అనకాపల్లి, వైజాగ్, కర్నూల్, పొద్దుటూరు, హిందూపురం, తాటిపాక, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, కోయిలకుంట్ల సహా.. 24 సెంటర్స్‌లో అఖండ 50 రోజులు పూర్తి చేసుకుంది. అన్నట్లు ఈ చిత్రం 54 కోట్ల బిజినెస్ చేస్తే.. ఇప్పటి వరకు రూ. 80 కోట్ల వరకు షేర్ రాబట్టింది. 24 సెంటర్స్‌లో డైరెక్ట్ 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ పడటం అది బాలయ్య ‘అఖండ’ సినిమా విషయంలోనే సాధ్యమైందని చెప్పాలి. (Twitter/Photo)