NBK - Akhanda : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో అరాచకం సృష్టిస్తోంది.ఈ సినిమాలో బాలయ్య అఘోర గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో నందమూరి నట సింహం.. అఘోర కాకుండా మరో రెండు పాత్రల్లో అలరించనున్నట్టు సమాచారం. మొత్తంగా బాలయ్య ఈ సినిమాలో ఎన్ని పాత్రల్లో నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. (Twitter/Photo)
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా విడుదలైన ‘అఖండ’ ట్రైలర్ యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపుతుంది . ఇందులో బాలయ్య డైలాగులు కూడా అదిరిపోయాయి. అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా.. పట్టుసీమ తూమా.. ఒక మాట నువ్వంటే శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. దైవ శాసనం.. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్డోజర్ని.. తొక్కిపారదొబ్బుతా.. మీకు ఏదైనా సమస్య వస్తే దండం పెడతారు.. మేమా సమస్యకు పిండం పెడతామంటూ బాలయ్య చెప్పిన డైలాగులు పేలాయి. (Twitter/Photo)
అంతకు ముందు విడుదలైన టీజర్లో హర హర మహదేవ్, శంభో శంకర అంటూనే కాలు దువ్వే నంది ముందు.. రంగు మార్చే పంది అంటూ బాలయ్య చెప్పిన ఒక్క డైలాగుతో ఈ సినిమా రేంజ్ ఏంటనేది బోయపాటి చెప్పకనే చెప్పేసాడు. ఈ సినిమాలో ఇప్పటి వరకు మూడు గెటప్‌లకు సంబంధించిన లుక్స్ పోస్టర్స్‌ను రిలీజ్ చేసారు. దీంతో ఈ సినిమాలో బాలయ్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడా అని అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. (Twitter/Photo)
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జనరేషన్ విషయానికొస్తే..ఎక్కువ సినిమాల్లో డ్యూయల్ రోల్లో నటించిన రికార్డు బాలకృష్ణ సొంతం. తాజాగా ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న ‘అఖండ’లో బాలయ్య డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు ముందు నుంచి వినబడుతోంది. కానీ అఘోర లుక్‌తో బాలయ్య ఈ సినిమాలో మరోసారి మూడు పాత్రల్లో నటిస్తున్నారా అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మొత్తంగా బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో నటించారో మీరు ఓ లుక్ వేయండి.. (Balakrishna in Akhanda Photo : Twitter)
ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో హరిశ్చంద్రుడిగా, దుష్యంతుడిగా రెండు పాత్రల్లో నటించిన బాలకృష్ణ. ఈ చిత్రాన్ని హిందీలో కూడా తెరకెక్కించారు. అందులో కూడా రెండు పాత్రల్లో నటించారు. తెలుగులో డిజాస్టర్‌గా నిలిచిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా హిందీ వెర్షన్ మాత్రం విడుదలకు నోచుకోలేదు. (Youtube/Credit)
తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అఖండ’లో బాలకృష్ణ.. ద్విపాత్రాభినయం చేస్తున్నారా.. లేకపోతే.. త్రిపాత్రాభినయం చేస్తున్నారా అనేది చూడాలి. అది కూడా కవల సోదురులుగా నటించబోతున్నట్టు సమాచారం. కొన్ని నిమిషాల తేడా వల్ల జన్మించిన కవలల జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది. దానికి జ్యోతిషం కనెక్ట్ చేసి బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. (Twitter/Photo)