NBK - Akhanda : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ’. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబో క్రేజ్‌కు ఈ సినిమాను ప్లస్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలై 8 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా అఘోరగా బాలయ్య పర్ఫామెన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కు చేరువలో ఉంది. ఈ సినిమాలో బాలయ్య అఖండగా, మురళీ కృష్ణగా కవల సోదురులుగా నటించారు. అఖండ కాకుండా బాలయ్య తన కెరీర్లో ఎన్ని సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారో మీరు ఓ లుక్ వేయండి. (Twitter/Photo)
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’చిత్రం డిసెంబర్ 2న విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. అంతేకాదు బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు బడా స్టార్ హీరోల మార్కెట్ ప్రశ్నార్ధకమైన ఈ పరిస్థితుల్లో బాలయ్య వన్ మ్యాన్ షో చేసి వావ్ అనిపించారు. ఇక అఖండ గా బాలయ్య కాకుండా మరో హీరోను ఊహించుకోవడం కష్టమే అంటున్నారు కామన్ ఆడియన్స్. ఈ సినిమాలో నటనకు బాలయ్య నటనకు అందరు దాసోహం అంటున్నారు. . ఇందులో బాలయ్య డైలాగులు కూడా అదిరిపోయాయి. (Twitter/Photo)
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ జనరేషన్ విషయానికొస్తే..ఎక్కువ సినిమాల్లో డ్యూయల్ రోల్లో నటించిన రికార్డు బాలకృష్ణ సొంతం. తాజాగా ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’లో బాలయ్య డ్యూయల్ రోల్లో అదరగొట్టారు. ముఖ్యంగా ‘అఖండ’ పాత్రలో అఖండమైన నటనను కనపరిచారు. అఘోర పాత్రలో బాలయ్య రోల్ నభూతో అనే రీతిలో ఉంది. (Balakrishna in Akhanda Photo : Twitter)
ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో హరిశ్చంద్రుడిగా, దుష్యంతుడిగా రెండు పాత్రల్లో నటించిన బాలకృష్ణ. ఈ చిత్రాన్ని హిందీలో కూడా తెరకెక్కించారు. అందులో కూడా రెండు పాత్రల్లో నటించారు. తెలుగులో డిజాస్టర్‌గా నిలిచిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా హిందీ వెర్షన్ మాత్రం విడుదలకు నోచుకోలేదు. (Youtube/Credit)
తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకె ‘అఖండ’లో బాలకృష్ణ.. రెండు పాత్రల్లో అదరగొట్టారు. అది కూడా కవల సోదురులుగా నటించారు. అందులో ఒకరు రైతు పాత్ర అయితే.. మరొకటి అఘెరా. అఘోరా పాత్రనే ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచంది. ఈ సినిమాలో అఖండగా బాలయ్య ఆహార్యం, నటన అదిరిపోయింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెట్టారు బాలయ్య. (Twitter/Photo)