నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda) విజయవంతంగా 25రోజులకు పూర్తి చేసుకుంది. దీంతో టీమ్ తాజాగా డిస్ట్రీబ్యూటర్స్ సమక్షంలో సంబరాలు చేసుకుంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
అంచనాలను మించి దుమ్ము లేపుతోంది అఖండ. ఈ సినిమా పదిరోజుల్లో 100 కోట్ల క్లబ్‌కి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టింది. అంతేకాదు తాజాగా పోటిగా వచ్చిన పుష్పతో పాటు శ్యామ్ సింగ రాయ్‌తో కూడా పోటి పడుతూ మంచి వసూళ్ళనే సొంతం చేసుకుంటోంది. Photo : Twitter
ఈ సినిమా టోటల్ టార్గెట్ 54 కోట్లు కాగా మొత్తం మీద 15.06 కోట్ల ప్రాఫిట్‌తో దూసుకుపోతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఓ రేంజ్లో అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించింది చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారు. Photo : Twitter
బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రం కూడా మంచి విజయం దక్కించుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. Photo : Twitter