నారీ నారీ నడమ మురారి హీరోగా బాలయ్య కెరీర్లో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా బాలయ్యను పూర్తి క్లాస్‌గా చూపించింది. ఈ సినిమాలో బాలయ్యకు ఒక్క ఫైట్ సీన్ లేకపోవడం విశేషం. అప్పటికే ఈయన మాస్ హీరోగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమను దున్నేస్తున్న సమయంలో ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించడం విశేషం. (Twitter/Photo)
నారీ నారీ నడుమ మురారి సినిమాకు తనికెళ్ల భరణి, భమిడిపాటి రాధాకృష్ణ,సత్యమూర్తి కథను అందించారు. వినాయక శర్మ మాటలను అందించారు. ఈ సినిమాను ఏ.కోదండరామిరెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. మరోవైపు బాలకృష్ణను ఈ సినిమాలో కొంచెం కొత్తగా చూపించారు. ఇక దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి, బాలకృష్ణ కాంబినేషన్లో పదమూడు చిత్రాలు తెరకెక్కిస్తే.. అందులో 7 సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. నాలుగు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. 2 చిత్రాలు మాత్రం యావరేజ్‌తో సరిపెట్టుకున్నాయి.(Twitter/Photo)
నందమూరి బాలకృష్ణ దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో చివరి మూడు చిత్రాలు ‘మాతో పెట్టుకోకు’, ముద్దుల మొగుడు’‘యువరత్న రాణా’ చిత్రాలు ప్లాప్‌గా నిలిస్తే.. మొదటి మూడు చిత్రాలు ..అనసూయమ్మ గారి అల్లుడు, ‘భార్గవ రాముడు’, ‘భానుమతి గారి మొగుడు’ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలవడం విశేషం. (Twitter/Photo)