బాహుబలి బిగినింగ్@5 ఇయర్స్.. ప్రభాస్, రానాలతో మాయ చేసిన రాజమౌళి..
బాహుబలి బిగినింగ్@5 ఇయర్స్.. ప్రభాస్, రానాలతో మాయ చేసిన రాజమౌళి..
చినుకు చినుకు గాలివానగా మారినట్టు.. తెలుగు సినిమాగా ప్రారంభమైన ’బాహుబలి’.. ఆ తర్వాత జాతీయ స్థాయిలో అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ,నాజర్, సత్యరాజ్ వంటి ప్రధాన పాత్రలతో రాజమౌళి తెరకెక్కించిన ’బాహుబలి’ భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకుంది. ఈ సినిమా మొదటి పార్ట్ విడుదలై నేటితో 5 ఐదేళ్లు. ఈ సందర్భంగా ఈ సినిమా సాధించిన రికార్డులు..
రాజమౌళి, ప్రభాస్, రానాల ’బాహుబలి.. ‘ది బిగినింగ్’ కు ఐదేళ్లు (Twitter/Photo)
2/ 36
రాజమౌళి తెలుగు సినిమాగా ప్రారంభించిన ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీగా రూపొంతరం పొందింది. (Twitter/Photo)
3/ 36
ఒక భాషలో మెప్పించిన సినిమా వేరే భాషలో మెప్పించడం అంత సులభం కాదు. కానీ రాజమౌళి అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసాడు. (Twitter/Photo)
4/ 36
దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో కూడా సంచలనాలు నమోదు చేసిన తొలి చిత్రంగా ‘బాహుబలి’ రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
5/ 36
ప్రభాస్ ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు. (Twitter/Photo)
6/ 36
జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన బాహుబలి (Twitter/Photo)
7/ 36
ప్రధాన మంత్రి సహా పలువురు రాజకీయ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాహుబలి పేరును విరివిగా వాడుకున్నారు. ఈ రకంగా దేశ వ్యాప్తంగా అందరి పొలిటిషన్స్ బాహుబలి చిత్రాన్ని తమ ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. (Twitter/Photo)
8/ 36
హీరోగా ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు పెంచిన సినిమా బాహుబలి (Twitter/Photo)
9/ 36
తెలుగు సినిమాగా ప్రారంభమైన ‘బాహుబలి’ఈ సినిమా ఆ తర్వాత దేశీయ సినిమాగా.. ఆపై ఇంటర్నేషనల్ లెవల్లో ఓ ప్రభంజనం సృష్టించింది. (Twitter/Photo)
10/ 36
హిందీ చిత్ర పరిశ్రమలో కూడా బాహుబలి ఓ ప్రభంజనం సృష్టించింది. ఒక్క హిందీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా బాహుబలి అనేది ఓ బ్రాండ్‌గా మారింది. (Twitter/Photo)
11/ 36
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు ఒక మార్గం ఏర్పాటు చేసిన రాజమౌళి (Twitter/Photo)
12/ 36
అంతేకాదు ఒక కథతో తెరకెక్కిన ఈ సినిమా రెండు పార్టులగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అది కూడా రెండు పార్టులు విజయం సాధించిన సినిమాలు చాలా అరుదుగా ఉన్నాయి. (Twitter/Photo)
13/ 36
భారతీయ చిత్ర పరిశ్రమలో అంతకు ముందు కనీవినీ ఎరగనీ రీతిలో వసూళ్ల ప్రభంజాన్ని సృష్టించింది. (Twitter/Photo)
14/ 36
ముఖ్యంగా బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవుడిగా రానా, రాజమాత శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జాలాదేవుడిగా నాజర్, అవంతికగా తమన్నా, దేవసేనగా అనుష్క నటన ఈ సినిమాకు హైలెట్. (Twitter/Photo)
15/ 36
ముఖ్యంగా బిజ్జాలదేవుడిగా నాజర్, కట్టప్పగా సత్యరాజ్, రాజమాత శివగామిగా వాళ్లు నటించిన తీరు అద్భుతం. ఆయా పాత్రల్లో వారిని తప్పించి మరోకరిని ఊహించుకోవడం కష్టమే. (Twitter/Photo)
16/ 36
2013 జూలై 6న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. (Twitter/Photo)
17/ 36
రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు బాహుబలి సినిమా తార్కాణంగా నిలిచింది. (Twitter/Photo)
18/ 36
దర్శకుడిగా సూచనలు అందిస్తోన్న రాజమౌళి (Twitter/Photo)
19/ 36
2013 జూలై 6న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్‌ను రామోజీ ఫిల్మ్‌సిటీలో కాకుండా.. కర్నూలులోని రాక్ గార్డెన్స్ వద్ద ప్రారంభమైంది. (Twitter/Photo)
20/ 36
వేలాది మంది అభిమానుల సమక్షంలో బాహుబలి షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి (Twitter/Photos)
21/ 36
ఈ సినిమాను కే.రాఘవేంద్రరావు సమర్ఫణలో ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. (Twitter/Photo)
22/ 36
బాహుబలి చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. (Twitter/Photo)
23/ 36
బాహబలి మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. (Twitter/Photo)
24/ 36
బాహుబలి రెండో పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 1800 కోట్ల వరకు వసూలు చేసి ఔరా అనిపించింది. (Twitter/Photo)
25/ 36
బాహుబలి సెకండ్ పార్ట్ హిందీ వెర్షన్ కేవలం మన దేశంలోనే రూ. 500 కోట్లకు పైగా రాబట్టింది. (Twitter/Photo)
26/ 36
కేవలం హిందీ వెర్షన్లోనే ఈ సినిమా రెండు పార్టులు కలిపి రూ. 1300 కోట్ల వరకు రాబట్టింది. (Twitter/Photo)
27/ 36
ఇప్పటి వరకు బాహుబలి సాధించిన రికార్డులు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. (Twitter/Photo)
28/ 36
మొత్తంగా రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో ‘ఛత్రపతి’ తర్వాత ‘బాహుబలి’ రెండు పార్టులు తెరకెక్కడం విశేషం (Twitter/Photo)
29/ 36
రాజమౌళి, ప్రభాస్ ‘బాహుబలి 2’ చిత్రానికి నేటితో ఐదేళ్లు. ఈ సినిమాతో ప్రభాస్‌కు ‘రష్యా ఆడియన్స్ హార్ట్’ అవార్డు దక్కింది. (Twitter/Photo)
30/ 36
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా పలు చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రదర్శింపబడింది. (Twitter/Photo)
31/ 36
‘బాహుబలి’ చిత్రంపై కామిక్స్ బుక్ రావడంతో పాటు కార్టూన్ లు రావడం విశేషం. బాహుబలి అనేది సూపర్ హీరో క్యారెక్టర్‌గా మారింది. (Twitter/Photo)
32/ 36
అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ‘బాహుబలి’ చిత్ర ప్రదర్శన (Twitter/Photo)
33/ 36
హీరోగా ప్రభాస్ ఈ సినిమాతో బాహుబలి అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. (Twitter/Photo)
34/ 36
బాహుబలి సినిమా విడుదల సందర్భంగా అభిమానుల కోలాహలం (Twitter/Photo)
35/ 36
ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. (Twitter/Photo)
36/ 36
అంతకు ముందు తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో పలు అవార్డులు వచ్చినా.. ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలం అందుకున్న చిత్రంగా బాహుబలి రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)