Bahubali2@4Years: ’బాహుబలి 2 సహా బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు..
Bahubali2@4Years: ’బాహుబలి 2 సహా బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు..
Bahubali2@4Years | రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి 2 సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం ఆ తర్వాత ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకొంది. నేటితో ఈ సినిమా 4 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా కంటే బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల విషయానికొస్తే..
టా ప్ 1: ప్రభాస్తో అనుష్క జంటగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి 2’ వాల్డ్ వైడ్గా అన్ని భాషల్లో కలిపి రూ .1800 కోట్లు వసూలు చేసింది. ఒక్క హిందీ వెర్షన్ మన దేశంలో మా త్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.550 కోట్ల వరకు వసూళు చేయడం విశేషం.
2/ 10
టాప్ 2: ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ‘దంగల్’ సినిమా రూ.2000 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా హిందీ వెర్షన్ మన దేశంలో రూ.500 కోట్ల వరకు వసూలు చేయడం విశేషం.
3/ 10
టాప్ 3: వివాదాస్పద నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా రణ్బీర్ కపూర్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంజు’ కూడా రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. మొత్తంగా ‘సంజు’ బయోపిక్ మన దేశంలో రూ.370 కోట్లకు పైనే రాబట్టింది.
4/ 10
టాప్ 4: ఆమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పీకే’ ప్రపంచ వ్యాప్తంగా రూ.854 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 350 కోట్లను వసూలు చేసింది.
5/ 10
టాప్ 5: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘టైగర్ జిందా హై’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.339 కోట్ల వసూళ్లను రాబట్టింది.
6/ 10
టాప్ 6: సల్మాన్ ఖాన్ భజరంగీ భాయిజాన్ ఓవరాల్గా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.320 కోట్లను కొల్లగొట్టింది.
7/ 10
టాప్ 7: ‘పద్మావత్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 302 కోట్లను కొల్లగొట్టింది.
8/ 10
టాప్ 8: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘సుల్తాన్’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 300 కోట్లను వసూళు చేసింది.
9/ 10
టాప్ 9: ఆమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా, ఉదయ్ చోప్రా నటించిన ‘ధూమ్ 3’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.290 కోట్లను కొల్లగొట్టింది.
10/ 10
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.280 కొల్లగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.350 పైగా రాబట్టింది. (Twitter/Photo)