Bahubali2@4Years: బాహుబలి 2 @ 4 ఇయర్స్.. ప్రభాస్‌‌తో దర్శక ఛత్రపతి రాజమౌళి మాయాజాలం..

Bahubali2@4Years | రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి 2 సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం ఆ తర్వాత ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకొంది. ఈ చిత్రం తెలుగులోనే కాదు.. ఇప్పటి వరకు మన దేశంలోనే ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్లు వసూళు చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. డిజిటల్ యుగంలో మన దేశంలోనే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన చిత్రంగా బాహుబలి 2 రికార్డులకు ఎక్కింది. మొత్తంగా మాములు మహా భారత కథను పోలిని బాహుబలి 2 అనేది ఇండియన్ సినిమాలో ఒక ఎపిక్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా విడుదలై నేటికి 4 యేళ్లు పూర్తి చేసుకుంది.