అఖిల్ అక్కినేని సైతం అయ్యప్ప మాల ధరించారు. అక్కినేని హీరోను మాలలో చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే నాగేశ్వరరావు దేవుడిని నమ్మడు. నాగార్జున ఎప్పుడూ మాల వేయలేదు. చైతూ కూడా అదే దారిలో వెళ్లారు. కానీ అఖిల్ మాత్రం అయ్యప్ప మాల ధరించారు.అయ్యప్ప దీక్ష తర్వాతనే ఈయనకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్తో తొలి సక్సెస్ అందుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతారు. (Twitter/Photo)
ఉన్ని ముకుందన్ | తెలుగు హీరోలు కాకుండా వేరే భాషల హీరోలు అయ్యప్ప మాల వేసుకున్న సందర్భాలున్నాయి. ఉన్ని ముకుందన్ కూడా ‘మల్లిక్కాపురం’ సినిమాలో స్వయంగా అయ్యప్ప స్వామిగా నటించారు. అంతకు ముందు మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా అయ్యప్ప స్వామి వేషం వేసి స్వామిపై తమ భక్తి చాటుకున్నారు. వీళ్లు స్వయంగా అయ్యప్ప మాల వేసుకున్న సందర్భాలున్నాయి. ‘మల్లిక్కాపురం’ సినిమాలో ఉన్ని ముకుందన్ స్వయంగా అయ్యప్ప దీక్షలో ఉండి ఈ సినిమా చేసినట్టు మీడియాకు చెప్పారు. (Twitter/Photo)