జబర్దస్త్ జడ్జ్‌గా కొన్నేళ్ల పాటు సేవలందించింది రోజా. ఓ వైపు రాజకీయాల్లో భాగమవుతూనే వారం వారం కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్‌తో ప్రతి ఇంటి గడప తొక్కేది రోజా. అయితే ఆమెకు మంత్రి పదవి రావడంతో రీసెంట్గా ఈ షో నుంచి తప్పుకుంది. దీంతో ఇదే పాయింట్ బేస్ చేసుకొని ఓ స్కిట్ చేశాడు జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్.