సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న 'యశోద' చిత్రాన్ని దర్శక ద్వయం హరి - హరీశ్‌లు దర్శకత్వం వహిస్తున్నారు. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ సినిమాలో సమంత యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొందని, ఆమె యాక్షన్ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకించి శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.
[caption id="attachment_1366534" align="alignnone" width="425"] అయితే ఈ సినిమా సమంతకు మంచి పరు తెచ్చి పెడుతుందన్నారు వేణు స్వామి. ఇకపోతే.. సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటారని కూడా అప్పట్లో వ్యాఖ్యలు చేసి వేణు స్వామి హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు సమంతతో పాటు మరికొందరు హీరోయిన్లపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సమంత-నాగ చైతన్య విడిపోతారని మూడేళ్ల క్రితమే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెప్పారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ అప్పట్లో వైరల్ అయ్యింది. సమంత-నాగ చైతన్యకు పెళ్లి తర్వాత విబేధాలు వస్తాయని,సినిమాల పరంగా బాగానే ఉన్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బందులు వస్తాయని వేణు స్వామి గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.