Telugu Heroines : సినీ ఇండస్ట్రీలో ఎంత పాపులర్ హీరోయిన్ అయిన 5 నుంచి 8 సంవత్సరాలోపే రాణించగలుగుతారు. ఇక ఆ తర్వాత ఓ అక్కగానో, లేక అత్తగానో కనిపించాల్సిందే. ఈ ఐదు సంవత్సరాల్లోనే వారు సంపాదించాల్సీ ఉంటుంది. ఇక వారి పెళ్లి విషయానికి వస్తే.. ఏ మహిళ అయిన అంతో కొంత ఫైనాన్షియల్ పరంగా సెక్యూరిటీ చూసుకుంటారు. అందులో భాగంగా హీరోయిన్స్ ఎక్కువుగా బిజినెస్‌మ్యాన్‌లను పెళ్లిచేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు బిజినెస్మ్యాన్స్ను పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ ఎవరో చూద్దాం.. Photo : Twitter
1) Asin.. ఆసిన్ తెలుగులో చేసింది నాలుగు సినిమాలే అయినా.. మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆమె తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో పరిచయం అయ్యింది. ఈ సినిమా విజయం తర్వాత తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో మంచి అవకాశాలు వచ్చాయి. ఇక హీరోయిన్గా మంచి ఫామ్‌లో ఉండగానే.. ఆసిన్, ప్రముఖ బిజినెస్‌మ్యాన్ మైక్రోమాక్స్ ఫౌండర్ రాహుల్ శర్మను 2016లో పెళ్లి చేసుకుంది. Photo : Twitter
2) Shilpa Shetty.. శిల్పా శెట్టి తెలుగులో సాహస వీరుడు సాగర కన్య, వీడెవడండీ బాబు, భలే వాడివి బాసు వంటి చిత్రాల్లో నటించి తన అందచందాలతో మైమరిపించింది. ఈ భామ తెలుగులో నటించిన సినిమాలు అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోవడంతో ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. శిల్పాశెట్టి ప్రముఖ బిజినెస్‌మ్యాన్ రాజ్ కుంద్రాను 2009లో పెళ్లి చేసుకుంది. Photo : Twitter
3) Vidya Balan.. విద్యాబాలన్ తెలుగులో ఓ రెండు చిత్రాల్లో నటించింది. ఎన్టీఆర్: కథానాయకుడు, ఎన్టీఆర్ : మహానాయకుడు. ఈ రెండు సినిమాల్లో తన నటనతో వావ్ అనిపించింది. విద్యా బాలన్ హిందీలో చాలా పాపులర్ హీరోయిన్.. ఆమె టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే ప్రముఖ బిజినెస్‌మ్యాన్, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను 2012లో పెళ్లి చేసుకుంది. Photo : Twitter
5) Reema Sen.. రీమా సేన్ తెలుగులో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ‘మనసంతా నువ్వే’ ‘బంగారం’ ‘వీడే’ ‘చెలి’, యుగానికి ఒక్కడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. రీమాసేన్ ప్రముఖ రెస్టారెంట్ బిజినెస్‌మ్యాన్ శివ కరణ్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. Photo : Twitter
7) Priayamani.. తమిళ పొన్ను ప్రియమణి తెలుగులో పెళ్ళైన కొత్తలో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ప్రవరాఖ్యుడు, యమదొంగ, రగడ, శంభో శివ శంభో, గోలిమార్, ద్రోణ, నారప్ప వంటి చిత్రాల్లో నటించింది. ఈ భామ ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజింగ్ బిజినెస్‌మ్యాన్ ముస్తఫా రాజ్‌ను పెళ్లి చేసుకుంది. Photo : Twitter
9) Purna .. పూర్ణ.. తెలుగులో శ్రీమహాలక్ష్మి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత.. సీమటపాకాయ్, ‘అవును', సుందరి, అదుగో, ‘అఖండ’ ‘దృశ్యం 2’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ భామ తాజాగా దుబాయ్‌కు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ షానిద్ ఆసిఫ్ అలీని 2022లో పెళ్లి చేసుకుంది. Photo : Twitter