ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో ‘చూడాలని వుంది, ఇంద్ర, జై చిరంజీవా’ సినిమాలు తెరకెక్కాయి. అందులో చూడాలని వుంది చిత్రం సూపర్ హిట్‌గా నిలిస్తే.. ఇంద్ర సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. చివరగా వీళ్ల కలయికలో వచ్చిన ‘జై చిరంజీవా’ చిత్రం మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి, వైజయంతీ మూవీస్ అధినేత సి అశ్వనీదత్ కలయికలో మొత్తంగా నాలుగు చిత్రాలు తెరకెక్కాయి. (Twitter/Photo)
‘జగదేవకవీరుడు అతిలోకసుందరి’ సినిమాకు జంధ్యాల మాటలు, వేటూరి పాటలు, ఇళయరాజా సంగీతం.. బాలు, జానకి, చిత్ర, శైలజ పాడిన పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. చిత్రాన్ని హిందీలో ‘ఆద్మీ ఔర్ అప్సర’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. దీంతో పాటు మిగతా భాషల్లో కూడా ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. (Twitter/Photo)
సి అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్లో చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన నాలుగు చిత్రాల్లో జై చిరంజీవ చిత్రం తప్పించి మిగతా మూడు చిత్రాల్లో ‘జ.గదేకవీరుడు అతిలోకసుందరి’, ‘ఇంద్ర’ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ‘చూడాలని వుంది’ సినిమా హిట్ అనిపించుకుంది. ‘జై చిరంజీవ’ మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది. మొత్తంగా వీళ్ల కలయికలో వచ్చిన చిత్రాల్లో 90 శాతం సక్సెస్ సాధించాయి. (Twitter/Photo)