అషూ రెడ్డి ఎక్స్‌ప్రెస్ హరి జంట ఒకప్పుడు ఎంతలా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. తెరపై ఒకలా తెరపై ఇంకోలా కనిపిస్తూ ఈ జంట మామూలుగా రచ్చ చేయలేదు. స్క్రీన్ మీదకు వస్తే లవర్స్‌లా నటిస్తుంటారు. ఆఫ్ స్క్రీన్‌లో హరిని అషూ ఏడిపిస్తుంటుంది. అన్నా అని పిలుస్తూ హరికి అషూ పిచ్చెక్కిస్తుంటుంది. తాజాగా మరోసారి ఈ జంట వార్తల్లోకి ఎక్కింది.
కామెడీ స్టార్స్ షోలో అషూ రెడ్డి, ఎక్స్ ప్రెస్ హరిలు చేసిన స్కిట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ స్కిట్లలో కాస్త లవ్ ట్రాక్‌ను జోడించారు. అది కాస్త సీరియస్ అయ్యే వరకు తీసుకొచ్చారు. స్టేజ్ మీదే లవ్ ప్రపోజల్స్ చేసుకునే వారు. అవి స్కిట్లో భాగంగానా? లేక నిజమా? అన్న కన్ఫ్యూజన్లో జనాలను పడేసేవారు.
ఆ టాటూ తాత్కాలికం అని, స్కిట్ కోసమే వేసుకున్నాడంటూ ముందు అనుకున్నారు. అయితే దీన్ని కూడా ప్రోమోలో వేసి ఎపిసోడ్ కోసం హైప్ పెంచేశారు. ఇక అషూ కూడా వీర లెవెల్లో నటించేసింది. స్కిట్లో భాగంగానా? నిజంగానా? ఏమో తెలీదు గానీ.. హరిని లాగి పెట్టి కొట్టేసింది. టాటూ ఎందుకు వేయించుకున్నావ్ అంటూ చెడామడా తిట్టేసింది.
ఎక్స్ ప్రెస్ హరి కోసం అషూ రెడ్డి కాస్ట్ లీ బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. హరికి బైక్ అంటే ఇష్టమని, ఓ కాస్ట్ లీ బైకుని కొని గిఫ్ట్ ఇచ్చింది అషూ రెడ్డి. ఆ సమయంలోనూ ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం ఎక్కువగా వైరల్ అయింది. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ రూమర్లు వస్తుంటాయి. కానీ తామిద్దరం మాత్రం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటుంటారు.