Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి. ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. కేవలం సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీగా మారింది. వెండితెరపై హీరో నితిన్ నటించిన సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం అందుకుంది. తాజాగా చిరిగిన ప్యాంట్‌తో బైక్ దగ్గర హాట్ ఫోజులిచ్చింది. (Instagram/Photo)
ఆ ఫొటోలకు అబ్రక దబ్బ.. గిలి గిలియా అని క్యాప్షన్ పెట్టింది. అషు రెడ్డి ఫొటోలు చూసిన నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు.ఏమక్కా.. అఘోరాలో కలిసిపోయావా? అంటూ సరాదాగా కామెంట్స్ చేస్తున్నారు. అషు రెడ్డి స్టిల్స్‌పై యాంకర్ రవి కూడా స్పందించాడు. వామ్మో.. సెట్ ప్రాపర్టీని కూడా వదలట్లేదుగా.. అంటూ ఫన్నీగా కామెంట్స్ వైరల్ అయ్యాయి. (Image:Instagram)