Ashok Galla As Hero Trailer Talk : కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇపుడు తాజాగా ఈయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేసారు. ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ ఖరారు చేసారు. రీసెంట్గా రాజమౌళి విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 15న విడుదల కాబోతున్న సందర్బంగా చిత్ర యూనిట్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అశోక్ గల్లా, నిధి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘హీరో’ చిత్రాన్ని అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పద్మావతి గల్లా, గల్లా జయదేవ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసారు. తొలిసారి ఈ సినిమాతో గల్లా జయదేవ్, పద్మావతి నిర్మాతలుగా మారారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. (Twitter/Photo)
గతంలో అశోక్ గల్లా హీరోగా ఓ సినిమా మొదలై ఆగిపోయింది. ఇపుడు తాజాగా ఈయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేసారు. ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కథానాయికగా నటించింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైవుతోంది. (Twittter/Photo)
‘హీరో’ చిత్రాన్ని సినీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఒక సామాన్య వ్యక్తి ఇండస్ట్రీలో హీరో కావాలనుకుంటారు. ఈ సందర్బంగా తన ప్రయాణంలో ఎదురైన కష్టాలను ఎలా ఎదుర్కొన్నాడు. చివరకు అనుకున్నది సాధించాడా లేదా అనేదే ‘హీరో’ మూవీ స్టోరీలా కనిపిస్తోంది. ఈ సినిమాలో గల్లా అశోక్ తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ నటించారు. మిగతా పాత్రల్లో జగపతి బాబు,అజయ్ తదితరులు నటించారు. (Twitter/Photo)
ఈ సినిమాలో ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణ స్టెప్పేసిన జుంబారే జుం జుంబరే పాటను రీమిక్స్ చేసారు. ఈ పాట అప్పట్లో సంచలనం. ఇప్పటికీ ఈ పాటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాలో 'జుంబారే' పాటలో సూపర్ స్టార్ కృష్ణ డ్యాన్సుతో అలరించారు. అప్పట్లో ఓ బడా హీరో ఈ రకంగా పాట కోసం గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం అదే మొదలు. తొలి సినిమాతోనే తాత సూపర్ స్టార్ కృష్ణ పాటను రీమిక్స్ చేయడం విశేషం. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడగా.. జొన్నవిత్తుల సాహిత్యం అందించారు. ఇప్పుడు ఈ పాటను హీరో సినిమా కోసం వాడుకున్నారు. (Twitter/Photo)
‘హీరో’ చిత్రంలో అశోక్ గల్లా, నిధి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో జగపతి బాబు, వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, బ్రహ్మానందం నటించారు. మరి తాత సూపర్ స్టార్ కృష్ణకు, మేనమామ మహేష్ బాబుకు ఎక్కువగా కలిసొచ్చిన సంక్రాంతి పండగ.. ఇపుడు వాళ్ల నట వారసుడిగా రంగ ప్రవేశం చేస్తోన్న గల్లా అశోక్‌కు కూడా కలిసొస్తుందా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)