సూపర్ స్టార్ కృష్ణ మనవుడు.. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఇంట్రడ్యూస్ అయిన చిత్రం ‘హీరో’. ఈ సినిమాను సినీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఒక సామాన్య వ్యక్తి ఇండస్ట్రీలో హీరో కావాలనుకుంటారు. ఈ సందర్బంగా తన ప్రయాణంలో ఎదురైన కష్టాలను ఎలా ఎదుర్కొన్నాడనే కాన్సెస్ట్ను ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ లేవు. ఆ సంగతి పక్కన పెడితే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ నేపథ్యంలో తెరకెక్కిన ఇతర చిత్రాల విషయానికొస్తే.. (File/Photo)
ఈ సినిమాలో ఒకప్పటి సూపర్ స్టార్ కృష్ణ స్టెప్పేసిన జుంబారే జుం జుంబరే పాటను రీమిక్స్ చేసారు. ఈ పాట అప్పట్లో సంచలనం. ఇప్పటికీ ఈ పాటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాలో 'జుంబారే' పాటలో సూపర్ స్టార్ కృష్ణ డ్యాన్సుతో అలరించారు. అప్పట్లో ఓ బడా హీరో ఈ రకంగా పాట కోసం గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం అదే మొదలు. మొత్తంగా సినీ నేపథ్యంలో తెరకెక్కిన ‘హీరో’ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. (File/Photo)
ఎన్టీఆర్, మహానటి సహా వెండితెరపై సినీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు అపుడపుడు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. సినిమా అంటే ఏంటి ? సినిమా అంటే జీవితం. అవును... జీవితంలో ఉండే ప్రతీ కోణం సినిమాలోనూ ఉంటుంది. అందుకే, సినిమా స్పృశించని రంగం భూమ్మీద ఏదీ లేదు. నేల మీద పని చేసే రైతులు మొదలుకొని నింగిలో చక్కర్లు కొట్టే పైలట్స్, అస్ట్రోనాట్స్ వరకూ అందరి జీవితాలూ సినిమాలో మనకు కనిపిస్తాయి. మరి అటువంటి సినిమా.. సినిమా నేపథ్యాన్ని కూడా ఒదిలిపెట్టలేదు. (File/Photo)
అన్న ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిన ఈ చిత్రంలో అన్నగారి తనయుడైన బాలయ్య.. తండ్రి రామారావు పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. కానీ నందమూరి అభిమానులకు ఈ సినిమా తీపి జ్ఞాపకంగా నిలిచిపోయింది. మరోవైపు మహానటుడు రామారావు కూడా ‘కథానాయకుని కథ’ అని సినిమా రంగానికి సంబంధించిన కథను చేయడం విశేషం. (File/Photo)
ఇక ఎన్టీఆర్, జయలలితల కంటే ముందు తెలుగులో అలనాటి మేటినటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ కూడా సినిమా నేపథ్యంలో తెరకెక్కిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్.. మహానటి సావిత్రి పాత్రలో జీవించింది. అంతేకాదు ఈ సినిమాలోని నటనకు కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకోవడం విశేషం. (File/Photo)
ఈ సినిమాల కంటే ముందు ఆ తర్వాత..చాలా సినిమాల్లో హీరో పాత్రలను కమెడియన్స్‌తో చేయించి ఆడియన్స్‌ను నవ్వించే ప్రయత్నం చేసారు మన దర్శక నిర్మాతలు. అందులో ‘దుబాయి శ్రీను’, ‘దూకుడు’, ‘దోచేయ్’ ‘పటాస్’ వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. ఈ సినిమాల్లో ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మానందం వంటి వారు హీరో వేషాలు వేసి ఆడియన్స్‌ను నవ్వించారు. (File/Photo)
ఇక రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన మరో సినీ నేపథ్య సినిమా ‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ . ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ వర్మ మార్క్ హిలేరియస్ సినిమా. దర్శకత్వం చేయటానికి ఫిల్మ్ నగర్ వచ్చిన ఓ అప్ కమింగ్ డైరెక్టర్ తంటాలు చూపిస్తాడు ఆర్జీవీ. ఆ పాత్రలో సునీల్ అద్భుతంగా నటించాడు. (File/Photo)
సినిమా వాళ్ల జీవితాల్నే సినిమాలుగా చూపటం కొత్తేం కాదు. ఒకప్పటి సినిమాల్లోనూ సినిమా దర్శనమిచ్చింది. హీరో గురించో, హీరోయిన్ గురించో, అప్పుడప్పుడూ సింగర్స్ గురించో సినిమాలు తీశారు మన వాళ్లు. అలా వచ్చినవే ‘డాక్టర్ సినీ యాక్టర్’, ‘ఇంధ్ర భవనం’, ‘కథానాయకుడి కథ’తో పాటు ‘శివరంజనీ’, ‘అద్దాల మేడ’ వంటి మొదలైన సినిమాలు ఫిల్మ్ నేపథ్యంలో తెరకెక్కినవే. దాసరి తెరకెక్కించిన ‘శివరంజినీ’ మూవీని రావూరి భరద్వాజ్ తెరకెక్కించిన ‘పాకుడు రాళ్లు’ నవలా ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. (File/Photo)
ఒకప్పటి హీరోలు మొదలు పెట్టిన సంప్రదాయాన్ని ఇప్పటి వారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ మలయాళ హిట్ మూవీని ‘కుచేలన్’, ‘కథానాయకుడు’ పేర్లతో తెలుగు, తమిళ్ భాషల్లోకి రీమేక్ చేశారు. స్నేహితుడి కోసం స్టార్డమ్ ని పక్కన పెట్టే పాత్రలో అద్భుతంగా నటించారు. ఎంత సూపర్ స్టార్ అయినా మిత్రుడ్ని మరిచిపోని తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌నే సినిమాలో అవలీలగా ప్లే చేశారు రజినీకాంత్. (File/Photo)
సినిమాలో సినిమాని చూపించటంలో రెండు రకాల పద్ధతులు కనిపిస్తాయి మనకి. ఒకటి సినిమాలో సినిమా హీరోనో, హీరోయిన్నో తమ లీడ్ రోల్స్ గా పెట్టుకుని కథ నడపటం. అయితే, ఇలాంటి స్టోరీస్‌లో సినిమా ప్రపంచం పెద్దగా కనిపించదు. హీరోదిగాని, హీరోయిన్‌ది గాని పర్సనల్ లవ్ స్టోరీనే ప్రధానమైపోతుంది. కాని, రెండో టైపు సినిమాల్లో సినిమా రంగమే ఇంపార్టెంట్‌గా మారిపోతుంది. ఫిల్మ్ నగర్ కష్టాలు, కృష్ణ నగర్ కన్నీళ్లు... ఇవే కథకి మూలం అవుతాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనింతే’ మూవీ ఫిల్మ్ నగర్ కష్టాలను చూపించారు. Siya gautam Photo : Instagram
తెలుగులో సినిమా పరిశ్రమ నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ... పూర్తిగా సినీ సినిమా అని చెప్పుకోటానికి వీలయ్యేలా తీసినవి... ‘నేనింతే’, ‘ఖడ్గం’ సినిమాలు. కృష్ణవంశీ తెరకెక్కించిన ‘ఖడ్గం’ సినిమా మెయిన్ గా దేశభక్తి చిత్రం అయినప్పటికీ... రవితేజ, సంగీత పాత్రలను సినిమా రంగానికి లింక్ చేసారు డైరెక్టర్ కృష్ణవంశీ. అక్కడి రంగుల ప్రపంచంలో వుండే విషాదా కోణాల్ని ప్రేక్షకులకి చూపే ప్రయత్నం చేసారు. (File/Photo)
‘ఖడ్గం’ సినిమాలో ఒక భాగం మాత్రమే సినిమా లోకం అయితే...‘నేనింతే’లో మొత్తానికి మొత్తం సినిమానే. కృష్ణానగర్ వీధుల్లో సినిమా అనే కల, సినిమా కళ... ఎలా పెల్లుబికి ప్రవహిస్తుంటుందో డైరెక్టర్ పూరీ హృద్యంగా చూపాడు. రవితేజ నటించటం కాక జీవించారు. ఈ మూవీలోనటనకు రవితేజ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. (File/Photo)
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్లీ’ కూడా సినీ నేపథ్యానికి లింక్ చేసి తెరకెక్కించారు. ఈ మూవీలో చరణ్..స్టంట్ మాస్టర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి తన నిజ జీవిత పాత్రలో నటించారు. అంతకు ముందు ‘స్టైల్’..రాజేంద్రప్రసాద్ ‘మేడమ్’ మూవీస్‌లో చిరు..తన నిజ జీవిత పాత్రలో కనిపించడం విశేషం. (File/Photo)
ఇక నాగార్జున కూడా ‘రావుగారిల్లు’ ‘స్టైల్’, ‘తకిట తకిట’ సినిమాల్లో తన నిజ జీవిత పాత్రైన హీరోగా నటించి మెప్పించారు.టాలీవుడ్ మరో యంగ్ హీరో నాగ చైతన్య సినీ సినిమా విషయంలో కొంచెం ముందున్నారు. ‘ఏ మాయ చేసావే’తో ఆ జానర్ లో ఆల్రెడీ సినిమా చేసేశారు. ఈ మూవీలో చైతూ అసిస్టెంట్ డైరెక్టర్ గా మెప్పించారు. ఆ తర్వాత ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ మూవీలో తన నిజ జీవిత పాత్రలో కనిపించడం కొసమెరుపు. (File/Photo)
హిందీ సినిమా వాళ్లు కూడా తమకు వీలైనప్పుడల్లా సినిమాని సినిమాలోకి తెచ్చేశారు. తమ హీరోని స్టోరీలోనూ సినిమా హీరోగా చూపించటమో... లేదంటే తమ కథానాయికని కథలోనూ హీరోయిన్గా చూపించటమో చేస్తూ వచ్చారు. అందులో బ్లాక్ బస్టర్స్ అయిన సినీ సినిమాలు కూడా వున్నాయి. షారుఖ్ ఖాన్ సినిమా నేపథ్యంలో సినిమా చేయటం ‘బిల్లు బార్బర్’లోనే కాదు ‘ఓం శాంతి ఓం’లో కూడా జరిగింది. రెండు జన్మల కథ అయిన ‘ఓం శాంతి ఓం’లో ఓ సారి స్ట్రగ్లింగ్ యాక్టర్ అయితే మరోసారి సూపర్ స్టార్. రెండూ పాత్రల్లోనూ బాద్షా అదరగొట్టేస్తే... ఫస్ట్ మూవీలోనే సినిమా హీరోయిన్ గా దీపిక వెలిగిపోయింది. (File/Photo)
అటు సిల్క్‌స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్’ కూడా సినీ నేపథ్యంలోనే తెరకెక్కింది. అటు బాలీవుడ్లో ‘హీరో హీరాలాల్’, ‘వెల్కమ్’ వంటి పలు చిత్రాల్లో సినీ నేపథ్యాన్ని జోడించి తెరకెక్కించారు. మొత్తానికి మన సినిమాల్లో సినీ నేపథ్యంతో తెరకెక్కడం పెద్ద విచిత్రమనే చెప్పాలి. వీటిలో చాలా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకోవాలి. మొత్తంగా టాలీవుడ్, కోలీవుడ్. బాలీవుడ్లో సినీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు పెద్ద విజయాలనే నమోదు చేసాయనే చెప్పాలి. (File/Photo)