సర్కారు వారి పాట కోసం ఎన్టీఆర్ రూట్లో మహేష్ బాబు..

ఈ యేడాది సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు.. తాజాగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించడమే కాకుండా... టైటిల్‌తో కూడిని ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. ఈ సినిమాలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ త్రిపుల్ రోల్లో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అది నిజమైతే.. ఈ జనరేషన్‌లో ఎన్టీఆర్ తర్వాత త్రిపాత్రాభినయం చేసిన హీరోగా మహేష్ బాబు రికార్డులకు ఎక్కడం ఖాయం. మహేష్ బాబు తన కెరీర్‌లో చిన్నపుడు తన తండ్రి కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో డ్యూయల్ రోల్లో నటించాడు. ఆ తర్వాత ‘నాని’ సినిమాలో తండ్రి కొడుకులుగా కాసేపు రెండు పాత్రల్లో కనిపించారు. కానీ హీరో అయిన తర్వాత పూర్తి స్థాయిలో డ్యూయల్ రోల్ చేయలేదు. ఇపుడు ఏకంగా మూడు పాత్రలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మహేష్ బాబు రూట్లోనే గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు పలు ఇండస్ట్రీల్లో త్రిపాత్రాభినయం చేసిన నటీనటులెవరున్నారో మీరు ఓ లుక్కేయండి..