RheaChakravarthy: బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేరు ఎంతలా హాట్ టాపిక్ గా మారిందో అందరికీ తెలిసిందే. సుశాంత్ మరణం గురించి కేసును దర్యాప్తు చేసిన సమయంలో డ్రగ్స్ కేసు కలకలం రేపింది. దీంతో రియాపై కేసు నమోదు కావడంతో తనను కొన్ని రోజులు అరెస్టు చేసి వదిలేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మళ్ళీ ఆమెను అరెస్టు చేయాలని వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సినీ సెలబ్రిటీలకు మేనేజర్ గా బాధ్యతలు తీసుకున్న దిశ సలియాన్ మరణించగా.. జూలై 8 న రియా.. సుశాంత్ ఇంటి నుండి బయటకు రావడంతో పలు అనుమానాలు వచ్చాయి. తాను సుశాంత్ కు తెలియకుండా మాదక ద్రవ్యాలు ఇచ్చిందని.. అలాంటి వ్యక్తికి స్వేచ్ఛను ఎందుకు ఇచ్చారని వెంటనే అరెస్టు చేయాలని తెగ కామెంట్లు చేస్తున్నారు సుశాంత్ అభిమానులు.