అందరు సిద్దమయ్యాక.. రేపు షూటింగ్ క్యాన్సిల్ చేయండి అని విశ్వక్ మెసేజ్లు పెడతాడు. ఒక రోజు షూటింగ్ అంటే ఎంతమంది కష్టం ఉంటుందో తెలుసు కదా? షూటింగ్ చేయాల్సిన సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. విశ్వక్ గురించి చెడుగా చెప్పాలని కాదు. నా ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లడం అంటే, నా పరపతికి దెబ్బ తగిలినట్లే కదా అని అర్జున్ అన్నారు.