బిగ్‌బాస్ తర్వాత అరియానా గ్లోరీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి అరియానా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఇక ముక్కుసూటి తనంతో బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అరియానా. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. (Photo Credit : Instagram)
అదే స్టార్డమ్తో బిగ్‌బాస్ సీజన్ 4లో కంటెస్టేంట్గా ఛాన్స్ కొట్టేసింది. హౌజ్‌లో బిగ్‌బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్‌లో పాల్గోంటూ మిగతా కంటెస్టెంట్స్‌కు గట్టి పోటీ ఇచ్చి తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చాక అరియానా కెరీర్ దృష్టి పెట్టింది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ జాగ్రత్త పడుతోంది. (Photo Credit : Instagram)