April Most Awaited Movies : టాలీవుడ్ ఇపుడిపుడే ఊపిరి పీల్చుకుంటోంది. ఒకప్పటి వైభవాన్ని మళ్లీ అందుకుందనే చెప్పాలి. ఫిబ్రవరి రిలీజై ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు మంచి వసూళ్లనే సాధించాయి. ఇక మార్చిలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఫైనల్‌గా తేలిపోయింది. ఇక మార్చి చివరి వారంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో థియేటర్స్ దగ్గర జనాలు పోటెత్తారు. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు వరకు చాలా రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఏప్రిలో నెలలో ఇప్పటికే ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి ఒకటి రెండు సినిమాలు విడులయ్యాయి. కానీ కేజీఎఫ్ 2 సినిమా తెలుగు డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక నెల చివరల్లో చిరంజీవి, రామ్ చరణ్‌లతో ఆచార్యతో పలకిరించారు. ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తంగా ఏప్రిల్ నెల బాక్సాఫీస్ రిపోర్ట్ విషయానికొస్తే..
గని | ఇక ఏప్రిలో నెలలో ఇప్పటికే ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి ఒకటి రెండు సినిమాలు విడులయ్యాయి. ఏప్రిల్ 8న వరుణ్ తేజ్ ‘గని’తో మూవీ విడుదలైంది. ఈ సినిమాకు ఆర్ఆర్ఆర్, కేజీఎప్ 2 సినిమాలు పెద్ద దెబ్బ వేసాయి. పైగా ఎలాంటి బజ్ లేకుండా విడుదలైన ఈ సినిమా ఓ వారంలోనే చాప చుట్టేసింది. ఈ సినిమా రూ. 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. మొత్తంగా రూ. 5 కోట్ల షేర్ రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
బీస్ట్ | విజయ్ హీరోగా నటించిన ఈ డబ్బింగ్ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏప్రిల్ 13న పలకరించనుంది. ఈ సినిమాలో విజయ్ ఏజెంట్ వీరరాఘవ పాత్రలో నటించారు. పూర్తి యాక్షన్ అండ్ కామెడీ మరియు దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. మొత్తంగా ఈ యేడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. (Twitter/Photo)
కెజియఫ్ ఛాప్టర్ 2 | కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ. ఈ చిత్రం మొదటి భాగం కేజీఎఫ్ చాఫ్టర్ 1తో యశ్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ సినిమా రెండో భాగం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అంతేకాదు రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరిన మూడో సౌత్ సినిమాగా నిలిచింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక నెల గ్యాప్‌లో రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. (kgf chapter 2)
ఆచార్య | చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్యలో నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఎప్రిల్ 29న విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ద అనే కామ్రేడ్ పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 75 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు నష్టాలను మిగిల్చే అవకాశాలున్నాయి. (Twitter/Photo)
మొత్తంగా ఏప్రిల్‌లో గని, ఆచార్య, వంటి తెలుగు చిత్రాలతో పాటు బీస్ట్, కేజీఎప్ ఛాప్టర్ 2 వంటి డబ్బింగ్ చిత్రాలు సందడి చేసాయి. వీటిలో యశ్, ప్రశాంత్ నీల్ల కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కేజీఎఫ్ 2’ మాత్రమే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. మొత్తంగా తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా కేజీఎప్ 2 దేశ్ కా బాక్సాఫీస్ కా బాద్షా అనిపించుకున్నాడు. (Twitter/Photo)