April Most Awaited Movies : టాలీవుడ్ ఇపుడిపుడే ఊపిరి పీల్చుకుంటోంది. ఒకప్పటి వైభవాన్ని మళ్లీ అందుకుందనే చెప్పాలి. ఫిబ్రవరి రిలీజై ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు మంచి వసూళ్లనే సాధించాయి. ఇక మార్చిలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఫైనల్గా తేలిపోయింది. ఇక మార్చి చివరి వారంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో థియేటర్స్ దగ్గర జనాలు పోటెత్తారు. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు వరకు చాలా రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఏప్రిలో నెలలో ఇప్పటికే ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి ఒకటి రెండు సినిమాలు విడులయ్యాయి. కానీ అసలు పోటీ అనేది ఈ శుక్రవారం వరుణ్ తేజ్ ‘గని’తో మొదలు కానుంది. ఆ తర్వాత వరుసగా విజయ్ ‘బీస్ట్’, యశ్ ‘కేజీఎఫ్ 2’ లతో పీక్స్ వెళ్లే అవకాశాలున్నాయి. మధ్యలో కొన్ని సినిమాలు థియేటర్స్లో సందడి చేయనున్నాయి. ఇక ఈ నెలాఖరులో చిరంజీవి, రామ్ చరణ్.. ‘ఆచార్య’తో ముగయనుంది.
గని | ఇక ఏప్రిలో నెలలో ఇప్పటికే ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి ఒకటి రెండు సినిమాలు విడులయ్యాయి. కానీ అసలు పోటీ అనేది ఈ శుక్రవారం వరుణ్ తేజ్ ‘గని’తో మొదలు కానుంది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్.. తమ్ముడు స్పూర్తితో తెరకెక్కినట్టు తెలుస్తోంది. తన బాక్సింగ్ గోల్ కోసం ఓ యువకుడు ఎలాంటి ప్రయత్నాలు చేసి సక్సెస్ అందుకున్నాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. (Twitter/Photo)
బీస్ట్ | విజయ్ హీరోగా నటించిన ఈ డబ్బింగ్ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏప్రిల్ 13న పలకరించనుంది. ఈ సినిమాలో విజయ్ ఏజెంట్ వీరరాఘవ పాత్రలో నటించారు. పూర్తి యాక్షన్ అండ్ కామెడీ మరియు దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. (Twitter/Photo)
కెజియఫ్ ఛాప్టర్ 2 | కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఎక్కువ మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ. ఈ చిత్రం మొదటి భాగం కేజీఎఫ్ చాఫ్టర్ 1తో యశ్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ సినిమా రెండో భాగం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా మొదటి భాగం కేజీఎఫ్ చాప్టర్ 1ను మించి సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి. (kgf chapter 2)