Tollywood Top Share Movies - RRR | పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే రికార్డుల పర్వం మొదలవుతోంది. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మరోసారి అది ప్రూవ్ అయింది. దీంతో ఇదివరకు రికార్డు కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఫస్ట్ వీక్‌లో రూ. 25 కోట్లు వసూలు చేస్తే ఎక్కువగా అనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు ఫస్ట వీక్‌లోనే దాదాపు రూ. 50 కోట్లకు పైగా షేర్ అనేది ఈజీ అయిపోయింది. రూ. 100 గ్రాస్ వసూళ్లను ఈజీగా క్రాస్ చేస్తున్నాయి తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 కలెక్ట్ చేసిన లైఫ్ టైమ్ కలెక్షన్లను త్వరలో క్రాస్ చేసే అవకాశాలున్నాయి. మొత్తంగా టాప్ షేర్ కలెక్ట్ చేసిన మూవీస్ విషయానికొస్తే.. (Twitter/Photo)
1..RRR 1st Day World Wide Highest Share Movies: టాలీవుడ్లో బడా హీరో సినిమా విడుదలైతే.. ఆ రచ్చే వేరుగా ఉంటోంది. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగడం ఖాయం. తాజాగా విడుదలైన ’ఆర్ఆర్ఆర్’తో మరోసారి ఇదే జరిగింది. ఆర్ఆర్ఆర్ విడుదలతో తెలుగులో మరోసారి రికార్డుల వేట మొదలైంది. నైజాంలో పెద్ద సినిమాల టోటల్ కలెక్షన్స్‌ను ఆర్ఆర్ఆర్ మూవీ మొదటి రోజే వసూళు చేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో నైజాం సహా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులు మటు మాయమయ్యాయి. (RRR movie)
ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు.. రూ. 135 కోట్ల షేర్ రాబట్టింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలల్లో బ్రేక్ ఈవెన్ సాధించి ఇప్పటి వరకు రూ. 234 కోట్ల షేర్ .రాబట్టింది. ఇక ఓవర్సీస్ తెలుగు వెర్షన్ రూ. 59.50 కోట్లు రాబడితే.. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా తెలుగు కలెక్షన్లు రూ. 33.80 కోట్లు కలిపితే.. ఓవరాల్‌గా రూ. 327.80 కోట్లతో బాహుబలి 2 తెలుగు వెర్షన్ రికార్డులను బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఏపీ, తెలంగాణలో ఈ సినిమా రూ. 272.31 కోట్లు వసూళు చేసింది. (Twitter/Photo)
2. బాహుబలి 2: రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇదే హైయ్యస్ట్ డే 1 కలెక్షన్స్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 123 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా తెలుగు వెర్షన్ బాహుబలి 2 రూ. 320 కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ దెబ్బకు 2వ స్థానంలోకి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 204 కోట్ల షేర్ రాబట్టింది. (Twitter/Photo)
3. అల వైకుంఠపురములో: అల్లు అర్జున్ రేంజ్ మరింత పెంచేసిన సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 25.93 కోట్ల షేర్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా 36.83 కోట్లను వసూళు చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 159.2 కోట్ల షేర్‌తో నాల్గో ప్లేస్‌లో ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 130.17 కోట్ల షేర్‌తో మూడో ప్లేస్‌లో ఉంది.
4. సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.77 కోట్లు షేర్ వసూలు చేసింది. ఈ సినిమా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 43.16 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తంగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ఈ సినిమా రూ. 138.78 కోట్లను రాబట్టి ఐదో ప్లేస్‌లో నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 117.50 కోట్ల షేర్ రాబట్టి 4వ స్థానంలో నిలిచింది.
5.బాహుబలి: రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో 2015లో విడుదలైన బాహుబలి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 22.4 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.46 కోట్ల షేర్ సాధించింది. ఓవరాల్‌గా తెలుగు వెర్షన్ ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఈ సినిమా రూ. 194 కోట్ల షేర్ రాబట్టి మూడో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 114 కోట్ల షేర్‌తో 5వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
6. వాల్తేరు వీరయ్య | మెగాస్టార్ చిరంజీవి హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 106 కోట్ల షేర్ (రూ. 171 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఇక ఓవరాల్ కలెక్షన్స్ విషయానికొస్తే.. 126 కోట్ల షేర్ (రూ. 216 కోట్ల గ్రాస్) వసూళ్లతో 6వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
7.సైరా నరసింహారెడ్డి: చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా సినిమా మొదటి రోజే 38.75 కోట్లు షేర్ వసూలు చేసింది. ఆ సినిమాపై అంచనాల దృష్ట్యా సైరా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు రూ. 53.72 కోట్ల షేర్ వసూళు చేసి ఔరా అనిపించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ రూ. 128 కోట్ల షేర్ రాబట్టి ఆరో స్థానంలో నిలిచింది. తెలంగాణ, ఏపీలో ఈ సినిమా రూ. 106.4 కోట్ల షేర్‌తో 7వ స్థానంలో నిలిచింది. (Fie/Photo)
8. రంగస్థలం:హీరో: రామ్ చరణ్, దర్శకుడు: సుకుమార్, ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.02 కోట్లు రాబట్టింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ రూ. 127.52 కోట్లతో 7వ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో కలిపి రూ. 95.27 కోట్ల షేర్ వసూళ్లను సాధించి 8వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)
9.‘సర్కారు వారి పాట’ | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 90.07 కోట్ల షేర్ రాబట్టి 9వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 110.12 కోట్ల షేర్(రూ. 200 కోట్ల గ్రాస్) తో రాబట్టింది.(Twitter/Photo)
10. పుష్ప | అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ మూవీ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 24.90 కోట్ల వసూళు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే విషయానికొస్తే.. 38.49 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ రూ. 110.08 కోట్ల షేర్ రాబట్టి.. 10వ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 85.35 కోట్ల షేర్ రాబట్టింది.