సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే
తెలుగు రాష్ట్రాల ప్రజలు తమకు ఇష్టమైన ముగ్గురు నటుల పేర్లను 'మా-ఏపీ' కార్యాలయానికి పంపాలి. పంపిన వారి వివరాలు, ఫోన్ నెంబర్ తప్పనిసరి కాగా.. ప్రజా బ్యాలెట్ లో ఎక్కువ ఓట్లు వచ్చిన ఒకరిని అవార్డుకు జ్యూరీ ఎంపిక చేస్తుందన్నారు. తెనాలిలో జరిగే ఈ అవార్డు వేడుక తేదీని మహేశ్ బాబుతో చర్చించిన అనంతరం చెబుతామన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆయన నటించిన తొలి చిత్రం 'తేనెమనసులు' ఫస్ట్ ఈస్ట్‌మన్ కలర్ సోషల్ చిత్రం. తొలి జేమ్స్‌బాండ్ చిత్రం 'గూఢచారి 116', తొలి కౌబాయ్ చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు', తొలి తెలుగు సినిమా స్కోప్ 'అల్లూరి సీతారామరాజు', తొలి తెలుగు 70ఎంఎం సినిమా 'సింహాసనం',