ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ నేత , ప్రముఖ నటుడు బాలకృష్ణ ఎదురెదుపడ్డారు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించేందకు ఇద్దరు ఒకేసారి అక్కడకు వెళ్లడంతో ఇప్పుడు వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణ మరణంతో సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
2/ 8
కృష్ణ భౌతిక కాయానికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు.. ప్రముఖ రాజకీయ నేతలు ఘన నివాళి అర్పించారు. నివాళులు అర్పించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. పద్మాలయ స్టూడియోలో ఉన్న కృష్ణ పార్థివ దేహానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.
3/ 8
మహేష్ బాబును కలిసి జగన్ ఓదార్చారు. జగన్ వచ్చే సమయంలో మహేష్ బాబును కలిసేందుకు అటు నందమూరి బాలకృష్ణ కూడా వచ్చారు.
4/ 8
కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు బాలకృష్ణ. అనంతరం మహేష్ బాబు ఫ్యామిలీని కలిసశారు. మహేష్ కుటుంబానికి బాలయ్య భరోసా ఇచ్చారు.
5/ 8
అప్పటికే మహేష్ బాబుతో మాట్లాడుతూ ఉన్నాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాకతో మహేష్ బాబు మరియు ఆయన కుటుంబ సభ్యులు నిలబడి ఉండగా వారితో కొద్ది సమయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అప్పుడే బాలకృష్ణ కనిపించడంతో నమస్కారం పెట్టాడు.
6/ 8
బాలయ్య, జగన్ ఒకరికి ఒకరు నమస్కారం పెట్టుకున్నారు, అక్కడున్న వారు బాలకృష్ణను ముందుకు రావాల్సిందిగా కోరగా పరవాలేదు అన్నట్లు బాలకృష్ణ మహేష్ బాబు వెనకే ఉండి పోయారు.
7/ 8
దాదాపు నిమిషంపాటు బాలకృష్ణ, మహేష్ పక్కన ఉండి జగన్ మాటలు విన్నారు. తరవాత బాలకృష్ణ ఇతర పనులు చేసుకోవడంలో బీజీ అయిపోయారు. మహేష్ తరవాత పక్కన ఉన్న గల్లా జయదేవ్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి జగన్ మాట్లాడారు.
8/ 8
సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఏసీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరేడు నిమిషాలు కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేష్‌బాబును అలింగనం చేసుకుని ఓదార్చారు.