అది అలా ఉంటే అనుష్క సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి తెలుగు పరిశ్రమలో ఉందని.. నేను కూడా అలాంటివి చూశాను. ఇది కేవలం తెలుగులోనే కాదు. ప్రతి ఇండస్ట్రీలో ఉందని పేర్కోన్నారు. నేను పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి చాలా సూటిగా నిక్కచ్చిగా మాట్లాడుతున్నాను. అందుకే ఇలాంటి పరిస్థితి నాకు ఎదురుకాలేదని ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్‌పై సంచలన కామెంట్స్ చేశారు. Photo : Twitter
ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. అనుష్క కొన్నాళ్లుగా ఎలాంటి సినిమాలను చేయడం లేదు. అయితే ఇన్నాళ్లకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చింది. అనుష్క బర్త్ డే సందర్భంగా ఆ మధ్య ఓ ప్రకటన విడుదలవ్వగా.. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోగా నవీన్ పొలిశెట్టి చేస్తున్నారని మరో ప్రకటన విడుదల చేసింది టీమ్. Photo : Twitter
వీన్ పొలిశెట్టి ఈరోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు అనుష్క కూడా నవీన్ పొలిశెట్టికి బర్త్ డే విషెస్ తెలుపుతూ గ్రీట్ చేసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. దీంతో ఇన్నాళ్లకు అనుష్క ఓ సినిమాకు ఓకే చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. Photo : Twitter
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహించనున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకు ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ నిర్ణయించారట. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అనుష్క విషయానికి వస్తే.. గత 3-4 ఏళ్ల నుంచి అనుష్క సినిమాలు బాగా తగ్గించేసింది. Photo : Twitter
ప్రభాస్ (Bahubali series) బాహుబలి-2 తర్వాత (Bhaagamathie) భాగమతి చేసింది. ఆ తర్వాత సైరాలో ఓ చిన్న పాత్ర చేసింది అనుష్క. ఇక ఆ తర్వాత ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన నిశ్శబ్దం సినిమా ఓటీటీలో రిలీజై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాల తర్వాత ఆమె ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. మరోవైపు ఆమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎంతో మంది సిద్ధంగా ఉన్నా కూడ ఆమె సైన్ చెయ్యట్లేదు. Photo : Twitter
ఇక ఇన్ని రోజులకు అనుష్క ఈ సినిమాను చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుందో.. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ముఖ్యంగా వైవాహిక వ్యవస్థపై నమ్మకం లేని ఓ అమ్మాయి, తనకంటే చిన్నవాడైన ఓ అబ్బాయితో డేటింగ్ అనే కాన్సెప్ట్‌తో వస్తోందని టాక్. యూవీ క్రియేషన్స్ సంస్ధ ఈ సినిమాను ఓ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ గా చెప్తోంది. Photo : Twitter