అనుష్క శెట్టి సహా పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..
అనుష్క శెట్టి సహా పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..
టాలీవుడ్లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సెపరేట్ స్టైల్ ఉంది. ఇక ఈయన తన సినిమాలతో పరిచయం చేసిన కథానాయికలు ఆ తర్వాత వివిధ ఇండస్ట్రీలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా పూరీ ఇంట్రడ్యూస్ చేసిన భామలు వీళ్లే..
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అనుష్క శెట్టి సహా ఎంతో మంది కథానాయికలను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసారు. అందులో చాలా మంది హీరోయిన్స్ తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నారు. (Twitter/Photo)
2/ 19
పూరీ జగన్నాథ్ తన తొలి చిత్రం ‘బద్రి’ సినిమాతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ను హీరోయిన్గా పరిచయం చేసారు. (Twitter/Photo)
3/ 19
అదే ‘బద్రి’ సినిమాతో అమీషా పటేల్‌ను తెలుగు తెరకు పరిచయం చేసాడు పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
4/ 19
‘బాచి’ మూవీతో నీలాంబరి అనే కథానాయికను పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
5/ 19
రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ సినిమాతో తనూ రాయ్ అనే హీరోయిన్గా పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
6/ 19
‘ఇడియట్’ మూవీతో రక్షితను పరిచయం చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
7/ 19
‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంతో అసిన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత కూడా పూరీ జగన్నాథ్‌కే దక్కింది. (Twitter/Photo)
8/ 19
‘143’ మూవీతో సమీక్ష అనే కథానాయికను పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
9/ 19
నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సూపర్’ సినిమాతో అనుష్క శెట్టిని వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే కదా. అదే సినిమాలో అయేషా టకియా తెలుగు తెరకు పరిచయం చేసాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. (Twitter/Photo)
10/ 19
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ సినిమాతో హన్సికను పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
11/ 19
’చిరుత’ సినిమాతో రామ్ చరణ్‌ను పరిచయం చేసిన చిరంజీవి.. అదే సినిమాలో నేహా శర్మను కథానాయికగా తెలుగు తెరకు పరిచయం చేసాడు పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
12/ 19
ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమాతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను తెలుగు తెరకు పరిచయం చేసాడు పూరీ జగన్నాథ్. (Twitter/Photo)
13/ 19
నితిన్ హీరోగా నటించిన ‘హార్ట్ ఎటాక్’ మూవీతో అదాశర్మను తెలుగు తెరకు పరిచయం చేసిన పూరీ జగన్నాథ్. (Twitter/Photo)
14/ 19
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ మూవీతో దిశా పటానీని పరిచయం చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్. (Twitter/Photo)
15/ 19
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ’ఇజం’ మూవీతో అదితి ఆర్యను కథానాయికగా పరిచయం చేసిన పూరీ జగన్నాథ్. (Twitter/Photo)
16/ 19
‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో ఏంజెలా క్రిస్లెంజీని పరిచయం చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత ఈ భామ పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘రోగ్’ లో ఓ కథానాయికగా నటించింది. (Twitter/Photo)
17/ 19
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘పైసా వసూల్’ మూవీలో ముస్కాన్ సేథిని కథానాయికగా పరిచయం చేసిన పూరీ జగన్నాథ్. (Twitter/Photo)
18/ 19
పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ కథానాయకుడిగా నటించిన ‘మెహబూబా’ సినిమాతో నేహా శెట్టిని కథానాయికగా పరిచయం చేసిన పూరీ.(Twitter/Photo)
19/ 19
తాజాగా విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తోన్న ‘ఫైటర్’మూవీతో బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. (Twitter/Photo)