Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటి కపుడు దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఓ ఫోటోలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. (Photo Credit/Anupama Instagram)
అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. (Photo Credit/Anupama Instagram)
ఈ యేడాది ఈ భామ దిల్ రాజు అన్న కుమారుడు హీరోగా నటించిన రౌడీ బాయ్స్ చిత్రంలో హీరోయిన్గా నటిచింది. ఈ చిత్రాన్ని 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి రూపొందించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై ఓకే అనిపించుకుంది. టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తన అందంతో, స్మైల్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Photo Credit/Anupama Instagram)