సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అనుపమ కార్తికేయ2 సినిమాలో నటించింది. ఈ సినిమా ఆగష్టు 13న థియేటర్లలో విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో అనుపమ ఎంతో బిజీగా ఉంది. Photo: Instagram
టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తన అందంతో, స్మైల్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.. Photo : Instagram
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్నాడు. సుకుమార్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా దిల్ రాజు నిర్మిస్తున్న మరో సినిమాలో కూడా అనుపమ అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది.. Photo : Instagram