Anupama Parameswaran : ఏ ఇండస్ట్రీలోనైనా సక్సెస్ ఉన్న లేకపోయినా.. సినీ ఇండస్ట్రీలో మనుగడ సాగించాలంటే ఎప్పటి కపుడు కొత్త కథలతో తమను తాము ప్రూవ్ చేసుకుంటూ వెళ్లాలి. ఇక నిన్న మొన్నటి వరకు వరుస పరాజయాలతో పాటు క్యారెక్టర్ రోల్స్‌కు పరిమితమైన అనుపమ పరమేశ్వరన్‌కు కార్తికేయ 2 సక్సెస్‌తో ఫుల్ హ్యాపీగా ఉంది. (Instagram/Anupama Parameswaran)
అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా మంచి పాపులారిటీ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా ఈమె వేసుకున్న హెయిర్ స్లైల్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Twitter/Photo)
ఈ యేడాది ఈ భామ దిల్ రాజు అన్న కుమారుడు హీరోగా నటించిన రౌడీ బాయ్స్ చిత్రంలో హీరోయిన్గా నటిచింది. ఈ చిత్రాన్ని 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి రూపొందించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై ఓకే అనిపించుకుంది. టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తన అందంతో, స్మైల్ తో ఎంతోమంది అభిమానుల హృదయాలను దోచుకుంది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo: Instagram
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ముద్దుగుమ్మ. ఇక రౌడీ బాయ్స్ సినిమాలో ఈ భామ లిప్ కిస్ పెట్టడం పై అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. Photo: Instagram
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క అన్నట్లు నడుము చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది అనుపమ. వాటిని చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా వామ్మో అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది అనుపమ. ఇకపై సినిమాల్లో కూడా కారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు హింట్స్ ఇస్తుంది ఈ కేరళ కుట్టి. Photo: Instagram
Anupama Parameswaran : ఇక ఆ మధ్య అనుపమ మాట్లాడుతూ.. గతంలో తాను ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించానని అనుపమ సంచలన ప్రకటన చేసింది. అతన్ని ఎంతో ఇష్టపడ్డాను.. అయితే కొన్ని కారణాల వల్ల మా ప్రేమ ముందుకు పోలేదు. బ్రేకప్ అయ్యామని చెప్పింది. అంతేకాదు యువ హీరో రామ్ పోతినేని తనకు మంచి ఫ్రెండ్ అని తెలిపింది. ఈ యేడాది రౌడీ బాయ్స్‌లో హీరోయిన్గా నటించిన ఈ భామ.. ఆ తర్వాత నాని ‘అంటే సుందరానికీ’ సినిమాలో క్యారెక్టర్ రోల్లో మెరిసింది. తాజాగా ఈమె నిఖిల్‌తో కలిసి కార్తికేయ 2తో భారీ సక్సెస్‌తో బ్యాక్ బౌన్స్ అయింది. Photo : Instagram