పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో బెల్లంకొండ రొమాన్స్..

Anu Emmanuel : తెలుగులో నాని హీరోగా వచ్చిన “మజ్ను” సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.. అను ఇమ్మానుయేల్. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘అజ్ఞాతవాసి’ సినిమా చేసింది అయితే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రావాల్సినంత గుర్తింపు రాలేదు ఈ భామకు. ఆ తర్వాత అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమాతో మరో డిజాస్టర్‌ను అందుకుంది. ఇక తమిళంలో ఆమె నటించిన “తుప్పారివాల‌న్‌” తెలుగులో “డిటెక్టివ్ ” గా వచ్చింది. అయితే వరుసగా సినిమాలు ప్లాప్స్ అవ్వడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు అను.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతోందని సమాచారం.