అను కష్టాలు అందరికీ తెలిసిపోతున్నాయా...

నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగుతెరపై మెరిసిన అను ఇమాన్యుల్‌ను అంత త్వరగా మర్చిపోలేరు. తన క్యూట్ లూక్స్ తో కుర్రకారును కట్టిపడేసిన ఈ భామకు ఇప్పుడు చెప్పుకొని కష్టాలు వచ్చి పడ్డాయి. ఆఫర్లు లేక ఈ ముద్దుగుమ్మ అవస్థలు పడుతోంది. ఛాన్సులు రాక చిన్నబోతుంది. కనీసం సెకండ్ హీరోయిన్ గా అయినా అవకాశాలు రాకపోతాయా అని ఎదురుచూస్తుంది . దాంతో చేసేదేమి లేక సోషల్ మీడియానే సాధనంగా వాడుకుంటుంది. తనలో అందాలను బయట పెడుతూ నెటిజన్లకు మత్తెక్కిస్తోంది.