Ante Sundaraniki | నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి.. (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. తొలి రోజే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ ప్రభావం కలెక్షన్స్ మీద పడింది. దీంతో అనుకున్న రీతిలో ఈ సినిమాకు కలెక్షన్స్ రాలేదు. (Twitter/Photo)
‘అంటే సుందరానికీ’ కామెడీ ఎంటర్టేనర్ అని చెప్పినా.. అది పూర్థి స్థాయిలో ప్రేక్షకులను కనెక్ట్ కాలేదు. పైగా మాస్ ఆడియన్స్కు కిక్ ఇచ్చే అంశాలు ఎలాంటివి ఇందులో లేకపోవడంతో ఓ వర్గపు ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేదు. పైగా థియేటర్స్లో టికెట్ రేట్స్ కూడా ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించింది. (Photo Twitter)
మొత్తంగా ఒకపుడు యావరేజ్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన నానికి ఇపుడు ఏ సినిమా చేసిన బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టేస్తోంది. ఒక్క జెర్సీ సినిమా కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఈ సినిమాలో నాని ఫ్యాక్టర్ మాత్రమే ఈ సినిమా విజయంలో కీ రోల్ పోషించింది. మొత్తంగా నాని కథల విషయంలో జాగ్రత్త పడే అవసరం ఏర్పడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. Photo Twitter