ఒకపుడు నాని ఏ సినిమాలు చేసిన ప్రేక్షకులు ఆదరించారు. అప్పటికీ నానికి అతని ఏజ్‌కు తగ్గ వేషాలు వచ్చాయి. వాటిని ప్రేక్షకులు కూడా ఆదిరించాయి. ఇపుడు వయసు పెరిగే కొద్దీ అలాంటి స్టోరీలే చేస్తానంటే ఆడియన్స్ అంగీకరించే స్థితిలో లేరు. తాజాగా ‘అంటే సుందరానికీ’ సినిమా రిజల్ట్‌తో అది మరోసారి నానికి అర్ధమైందా లేదా అనే సంగతి పక్కన పెడితే.. Photo Twitter
అంటే సుందరానికీ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 3.87 కోట్లు కలెక్ట్ చేసింది. వాల్డ్ వైడ్‌గా రూ. 5 కోట్ల వచ్చాయి. ఎపుడో ఐదేళ్ల క్రితం విడుదలైన MCA లాంటి సినిమా మొదటి రోజు.తెలుగు రాష్ట్రాల్లో రూ. . 7.57 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్ఇగా రూ. 10 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌ను బీట్ చేసే సినిమా ఏది నాని నుంచి రాలేదు. (Twitter/Photo)
‘భలే భలే మగాడివోయ్’ సినిమా తర్వాత చేసిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా సో సోగా ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఆ తర్వాత ఇంద్రగంటి దర్శకత్వంలో చేసిన ‘జెంటిల్మెన్’లో నటుడిగా తనలోని విలనీని బయటకు తీసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది. (Nani Ante Sundaraniki Photo : Twitter)
ఆ తర్వాత మజ్ను, నేను లోకల్, నిన్నుకోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలు చూస్తే ఇవన్నీ మాములు కథలే. యావరేజ్ టాక్‌తోనే ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టయ్యాయి. చెప్పాలంటే.. నాని తన నటనతో ఈ సినిమాలను విజయ తీరాలకు చేర్చాడు. MCA తర్వాత నానికి అసలు బాక్సాఫీస్ పరీక్ష మొదలైంది. నాని MCA విషయానికొస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తోంది. కానీ సెకండాఫ్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అయినా.. నాని తన నటనతో మాయ చేసాడు. ఈ సినిమా తర్వాత చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ రొటీన్ స్టోరీ కావడంతో పాటు ఈ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. Photo Twitter
మొత్తంగా నాని టైమ్ బాగున్నపుడు యావరేజ్ కంటెంట్‌తో కూడా సూపర్ హిట్స్ అందుకున్నాడు. మొత్తంగా MCA సినిమా 5 యేళ్ల క్రితం రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఆ తర్వాత ఆ రేంజ్ కమర్షియల్ సక్సెస్ నానికి పడలేదు. అప్పట్లో నాని ఎంసీఏ సినిమాను రూ. 33 కోట్లకు అమ్మారు. తాజాగా విడుదలైన ‘అంటే సుందరానికీ’ సినిమా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే.. హీరోగా నాని మార్కెట్ పెరిగినట్టా.. తగ్గినట్టా అని అందరు ప్రశ్నించుకుంటున్నారు. మొత్తంగా ఒకప్పటితో పోలిస్తే.. బాక్సాఫీస్ దగ్గర నాని మేనియా అంతగా వర్కౌట్ కావడం లేదు. (Twitter/Photo)
అంటే సుందరానికీ సినిమా విషయానికొస్తే.. అలా మొదలైంది తరహాలో కామెడీ ఎంటర్టేనర్‌గా ఉన్నా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు. అదే తరహాలో ఉన్న గ్యాంగ్ లీడర్ సినిమాలను కూడా ప్రేక్షకులు తిరస్కరించారు. దాంతో కాస్త డిఫరెంట్‌గా ట్రై చేసిన ‘వీ’, టక్ జగదీష్ వంటి సినిమాలు కూడా నానిని గట్టెక్కించలేకపోయాయి. శ్యామ్ సింగరాయ్ అంటూ పీరియాడికల్ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం హిట్ మాత్రమే అనిపించుకుంది. Photo Twitter
మొత్తంగా ఒక్కో హీరోకు ఒక్కో టైమ్ నడుస్తూ ఉంటోంది. ఒకప్పుడు నాని ఏం చేసినా ప్రేక్షకులు ఆదరించారు. మాములు యావరేజ్ కంటెంట్‌తో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు. ఇపుడు మాత్రం ఏ సినిమా చేసినా.. ప్రేక్షకులు ఆదరణ పొందలేకపోతున్నాయి. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్లో అన్ని సినిమాలను డబ్బులతో కొలవలేము అంటూ చెప్పడంతోనే ఈ సినిమా కమర్షియల్‌గా ఫెయిల్యూర్ అని తానే ఒప్పుకున్నాడు. మొత్తంగా నాని ఉన్న మార్కెట్‌ను కాపాడుకోవాలంటే ఎలాంటి సినిమాలు చేయాలనే దానిపైనే దృష్టి పెడితే.. బాగుంటుంది. (Twitter/Photo)