Rajinikanth: నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే రజినీకాంత్.. పెద్దన్నకు అసలేమైంది?
Rajinikanth: నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే రజినీకాంత్.. పెద్దన్నకు అసలేమైంది?
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయన బాగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నా.. అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. అసలు రజినీకాంత్‌కు ఏమైంది? ఏం సర్జరీ జరిగింది?
అక్టోబరు 28న రజినీకాంత్‌కు తల తిరిగినట్లుగా అనిపించింది. వెంటనే చెన్నైలోని అల్వార్పేట్లో ఉన్న కావేరి ఆస్పత్రికి వెళ్లారు. వైద్య నిపుణుల బృందం ఆయనకు పరీక్షలు చేసి రక్తనాళాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు.
2/ 6
గుండె నుంచి మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో క్లాట్స్ (రక్తపు గడ్డలు) ఉన్నట్లు డాక్టర్లు ధృవీకరించారు. వాటిని తొలగించేందుకు కారాటిడ్ ఆర్టరీ రివాస్కలరైజేషన్ సర్జరీ చేయాలని చెప్పారు. అక్టోబరు 29న ఆ సర్జరీ చేశారు.
3/ 6
మెడ భాగంలో ఉండ రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టి పూడిక ఏర్పడింది. డాక్టర్లు సర్జరీ చేసి ఆ గడ్డలను తొలగించారు. తద్వారా గుండె నుంచి మెదకు ఎలాంటి అడ్డంకులు లేకుండా.. సజావుగా రక్తం సరఫరా అయ్యేలా రక్తనాళాలను క్లియర్ చేశారు.
4/ 6
ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. క్రమంగా ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. సర్జరీ తర్వాత మూడు నాలుగు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని.. అందుకే ఆయన ఇంకా ఆస్పత్రిలో ఉన్నారని వెల్లడించారు.
5/ 6
రజినీకాంత్ త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదివారం కావేరి ఆస్పత్రికి వెళ్లి రజినీకాంత్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
6/ 6
కాగా, రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన అన్నాత్తె (తెలుగులో పెద్దన్న) మూవీ దీపావళి సందర్భంగా నవంబరు 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది.