ANIL RAVIPUDI REVEAL MAJOR UPDATES ON BALAKRISHNA NEW MOVIE SB
Balakrishna:బాలయ్య కూతురిగా ప్రముఖ హీరోయిన్.. క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! కొన్ని రోజుల నుంచి ఈ సినిమా విషయంలో తాను చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని చెప్తూ వస్తోన్న అనిల్.. ఆ ఎగ్జైట్మెంట్లోనే తాజాగా మూడు మేజర్ అప్డేట్స్ ఇచ్చేశాడు. మొదటిది.. ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుందన్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందన్నారు.
అఖండ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీద ఉన్న బాలయ్య ఇప్పుడు వరుసగా సినిమలు లైన్ లో పెట్టాడు.
2/ 14
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే!దీనిపై అనిల్ కూడా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు.
3/ 14
లెజెండ్ తర్వాత ఆ స్థాయి విజయం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న బాలయ్యకు అఖండ రూపంలో అదిరిపోయే హిట్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే అది కేవలం ఆయన విజయం మాత్రమే కాదు.. ఇండస్ట్రీ విజయం. ముఖ్యంగా కరోనా సమయంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా బాలయ్య మార్కెట్ కూడా అమాంతం పెంచేసింది.
4/ 14
బాలయ్యతో చేస్తున్న సినిమా గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ కొన్ని రోజుల నుంచి ఈ సినిమా విషయంలో తాను చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని చెబుతూ....ఆ ఎగ్జైట్మెంట్లోనే తాజాగా మూడు మేజర్ అప్డేట్స్ ఇచ్చేశాడు.
5/ 14
మొదటిది.. ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. రెండోది.. ఇందులో బాలయ్య 45 ఏళ్ళ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. మూడోది.. సెప్టెంబర్ నుంచే ఇది సెట్స్ మీదకి వెళ్తుంది.
6/ 14
ఎఫ్3 ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా లేటెస్ట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అనిల్ ఆ అప్డేట్స్ ఇచ్చాడు. బాలయ్య క్యారెక్టరైజేషన్ చాలా స్పెషల్‌గా ఉంటుందని, ఇందులో ఫ్యాన్ మూమెంట్స్ కూడా చాలా ఉంటాయని తెలిపాడు.
7/ 14
ఇక బాలయ్యతో చేస్తున్న సినిమాలో తన మార్క్ కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉండనున్నట్టు అనిల్ రావిపూడి ఖరారు చేశాడు.
8/ 14
ఇక ఈ సినిమాలో హీరోయిన్ పేరును కూడా చెప్పేశాడు అనిల్. ఇక బాలయ్య కూతురిగా ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీలా నటిస్తోందని అనిల్ తెలిపాడు.
9/ 14
శ్రీలీల అయితేనే ఈ సినమాకు బావుంటుందని.. ఆమె మాత్రం ఆ పాత్రకు న్యాయం చేస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు., అందుకే ఏరికోరి మరీ శ్రీలీలాని తీసుకున్నామని అనిల్ చెప్పుకొచ్చాడు.
10/ 14
నిజానికి.. శ్రీలీలా పేరు తెరమీదకొచ్చినప్పుడు, ఆమె బాలయ్యతో జోడీ కట్టనుందేమోనని అంతా అనుకున్నారు. కానీ, ఆ వార్తల్ని ఖండిస్తూ కూతురిగా నటించనుందని అనిల్ క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య సరసన ఓ స్టార్ హీరోయిన్ని రంగంలోకి దింపుతున్నారని సమాచారం.
11/ 14
బాలయ్య ప్రస్తుతం మలినేని దర్శకత్వంలో NBK107 ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది ముగిసిన వెంటనే, అనిల్ రావిపూడితో సెట్స్ మీదకి వెళ్లనున్నారు.
12/ 14
బాలయ్య ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో లెజెండ్ సీక్వెల్ తీసేందుకు కూడా నందమూరి యువరత్న రెడీ అయ్యాడు.
13/ 14
జనవరి 23, 2015న పటాస్ సినిమాతో వెండితెరకు డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి. అయితే బాలయ్యను అనిల్ తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచానలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు.
14/ 14
అనిల్ తీసిన ఎఫ్3 సినిమా ఈనెల 27 థియేటర్లలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో అనిల్ మరో హిట్ కొడతాడని టాక్ వినిపిస్తోంది. వెంకటేష్,వరుణ్ తేజ్‌తో పాటు ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించారు.