దసరాలో కీర్తి సురేష్ వెన్నెల అనే పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అంగన్ వాడీ టీచర్‌గా ఆమె కనిపించింది. అయితే ఓ సన్నివేశంలో కీర్తి సురేష్ కోడిగుడ్లను దొంగతనం చేసి అమ్ముకుంటున్నట్టు చూపించారు. ఆ గుడ్లను తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు షూట్ చేశారు. దీనిపై అంగన్వాడీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ సన్నివేశం తొలగించి.. దర్శకుడు అంగన్వాడీ వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.