Cinema Studios: ఆంధ్రప్రదేశ్ కు సినిమా రంగం తరలి రానుందా..? మొన్న సీనీ ప్రముఖులతో సీఎం జగన్ జరిపిన చర్చల్లో ప్రధాన అంశం.. ఇదే.. సినిమ రంగాన్ని ఏపీలో విస్తరించాలని సినీ ప్రముఖులను సీఎం జగన్ కోరారు.. అవసరమైతే భూ సేకరణ చేస్తామని.. స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఆహ్వానించడం.. అందుకు ప్రముఖులు ఓకే చెప్పడం జరిగిపోయాయి..?
ఇప్పుడు ఆ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ పరిపాలనా వికేంద్రీకరణపనైనే ఎక్కవగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులపై కొత్త బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మూడు ప్రాంతాల్లో సినిమా రంగ విస్తరణపై ఫోకస్ చేసినట్టు సమాచారం.
భూసేకరణ పూర్తయ్యాక స్టూడియోల నిర్మాణానికి రెండు విధానాలు అనుసరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. నిర్మాణం-నిర్వహణ-బదిలీ (బీఓటీ) విధానంలో స్టూడియోలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రైవేటుగా స్టూడియోలు నిర్మించడానికి ముందుకు వచ్చే వారికి భూమి కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.