మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. స్మాల్ స్క్రీన్ పై హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. తన అందాలతో బాగా రచ్చ చేస్తుంది. ఇప్పటికే అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువగా రెచ్చిపోతుంది. (Photo:Instagram)
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వర్షిణి.. చిన్న తెర రియాలిటీ షో ఢీ లో యాంకర్ గా చేసింది. అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా నిలిచిన వర్షిణి తన డాన్స్ స్టెప్పులతో కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఢీ షో నుండి బయటకు వచ్చిన ఈ బ్యూటీ స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ షో లో చేస్తుంది. తన ఎంట్రీ డాన్సులతో అందరి దృష్టినీ తనవైపు లాక్కుంటుంది. ట్రెడిషనల్, గ్లామర్ లుక్ లతో కూడా బాగా ఆకట్టుకుంటుంది. (Photo:Instagram)