యాంకర్ సుమ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై మకుటం లేని మహారాణి ఈమె. కొన్నేళ్లుగా ఈమెకు పోటీ ఎవరూ లేరు.. ఇప్పట్లో ఎవరూ వచ్చేలా లేరు. అలా ఎదురు లేకుండా దూసుకుపోతుంది యాంకర్ సుమ. ఒకప్పుడు నటిగానే ఇండస్ట్రీకి వచ్చినా.. తన దారి అది కాదని యాంకరింగ్ వైపు మళ్లిన తర్వాత ఈమె కెరీర్ కూడా టర్న్ అయిపోయింది. ఎవరూ ఊహించని విధంగా సంపాదిస్తుంది సుమ.
అంతేకాదు స్టార్ హీరోలు కూడా సుమతో సరదాగా ఉంటారు. ఓ పక్క బుల్లితెరపై పలు టీవీ షోలను హోస్ట్ చేస్తూనే.. మరోపక్క సినిమా ఈవెంట్స్‌లోనూ హంగామా చేస్తుంది సుమ. అయితే యాంకర్ కాకముందు సుమ కొన్ని సినిమాల్లో నటించింది. అప్పుడు ఈమెకు మంచి అవకాశాలు వచ్చాయి. అయితే తనకు తానుగా ఎందుకో మరి సినిమాల నుంచి తప్పుకుంది సుమ.
తర్వాత ఎంత మంచి అవకాశాలు వచ్చినా కూడా అటు వైపు చూడలేదు. అప్పట్లో వర్షం సినిమాలో ప్రభాస్‌కు అక్కగా నటించింది సుమ. చాలా ఏళ్ళ తర్వాత సుమ మళ్లీ సినిమాల్లోకి వస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది యాంకర్స్ సినిమాలు చేస్తున్నారు. సీనియర్ యాంకర్ ఝాన్సీ కారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయింది. అలాగే అనసూయ. రష్మీ గౌతమ్, శ్రీముఖి లాంటి యాంకర్స్ కూడా సినిమాలు చేస్తున్నారు.
దాంతో యాంకర్ సుమ కూడా సినిమాలు చేస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విషయం సుమను కూడా అడిగారు. దాంతో సుమ కూడా నటించాలని నిర్ణయించుకుంది. కొన్ని నెలలుగా ఈ వార్తలు వైరల్ అవుతుండగా.. తాజాగా దీనిపై రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చింది ఈ టాప్ యాంకర్. ఓ వీడియోలో సుమ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.