పెద్ద హీరోలకు సంబంధించిన ఏదైనా ఈవెంట్ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి. తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ తాజాగా ఓ సినిమాలో నటిస్తున్నారు.Photo : Instagram
దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ చిత్రానికి జయమ్మ పంచాయతీ (Jayamma Panchayathi first look) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో సుమ కొద్దిగా సీరియస్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. జయమ్మ పంచాయతీ సినిమాను విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. (Photo: kanakalasuma/Instagram)
ఇక సుమ గతంలో చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ‘పవిత్ర ప్రేమ’, ‘వర్షం’, ‘ఢీ’, ‘బాద్షా’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ సినిమాతో సుమ సుమారు 8 ఏళ్ల తర్వాత మరోసారి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి సుమ రీ ఎంట్రీ ఇస్తున్న జయమ్మ పంచాయితీ ఎలా ఉండనుందో... (Photo: kanakalasuma/Instagram)