ఇక అది అలా ఉంటే సుమ ఒక్క షోకు ఎంత వసూలు చేస్తుంటారో తెలుసుకోవాలనీ చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సుమ తెలుగులో పాపులర్ యాంకరే కాదు.. టాప్ యాంకర్ కూడా. స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే. సుమ ఒక్కో షో, ఈవెంట్‌కి దాదాపుగా రూ. 2-2.5 లక్షలు వసూలు చేస్తుంటారని టాక్.
యాంకర్ సుమయూట్యూబ్ ఛానల్ ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. సుమ ఛానల్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న చానల్స్ ఉన్నాయి, సుమ ఛానల్ యొక్క వ్యూస్ కంటే ఎక్కువ మంది చూసే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కానీ సుమ యొక్క యూట్యూబ్ ఛానల్ కి అత్యధిక రెవిన్యూ ఉంటుందని యూట్యూబ్ విశ్లేషకులు చెప్తున్నారు.
ఇక తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) అంటూ వచ్చిన ఈ సినిమాలో తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో సుమ (Anchor Suma) ప్రధాన పాత్రలో కనిపించారు. మంచి అంచనాల నడుమా విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Twitter