యాంకర్ సుమ కనకాల తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలాకైన మాటలతో గత 15 సంవత్సరాలుగా అలరిస్తున్నారు. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు.
సుమ చేస్తున్న ప్రముఖ టీవీ షోలలో క్యాష్ షో ఒకటి. ఈ క్యాష్ షోకు బదులుగా ఆ స్థానంలో సుమ హోస్ట్ గా సుమ అడ్డా అనే షో ప్రసారమవుతోంది. ఈ షోకు యాంకర్ సుమ గతంతో పోల్చి చూస్తే రెమ్యునరేషన్ ను భారీగానే పెంచేశారని టాక్. చాలామంది స్టార్ యాంకర్లు ఒక్కో ఎపిసోడ్ కు 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.
నెలలో నాలుగు లేదా ఐదు ఎపిసోడ్లు ఈ షో ప్రసారం కానుండగా ఈ షో ద్వారా నెలకు 8 లక్షల రూపాయల రేంజ్ లో సుమ సంపాదిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సుమ ప్రతిభకు మరింత ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా తప్పు లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సుమ హోస్టింగ్ వల్లే తెలుగులోని చాలా షోలకు మంచి రేటింగ్స్ వస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే. సుమ ఒక్కో షో, ఈవెంట్‌కి దాదాపుగా రూ. 2-2.5 లక్షలు వసూలు చేస్తుంటారని టాక్. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ యాంకర్లలో ఒకరిగా పేరుపొందిన ఈ 47 ఏళ్ల స్టార్ యాంకర్ ప్రస్తుతం పలు టీవీ షోలతో సూపర్ బిజీగా ఉన్నారు. Photo : Instagram