యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన యాంకరింగ్‌తో గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నారు. అది అలా ఉంటే ఆమె తాజాగా పప్పులో కాలేసినట్లు తెలుస్తోంది. సుమ ఈటీవీలో వచ్చే క్యాష్ ప్రోగ్రామ్‌కు యాంకరింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా దీనికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో సుమ ఎప్పటిలాగే తన యాంకరింగ్‌తో అదరగొట్టింది. అయితే ఒక చోట మాత్రం నోరు జారింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి శనివారం ఈటీవీలో వచ్చే క్యాష్ ప్రోగ్రామ్ రాబోయే ఎపిసోడ్‌తో రెండు వందల ఎపిసోడ్లను పూర్తి చేసుకోనుంది. దీంతో ఈ 200 షోకు అతిథులుగా ఎఫ్ 3 సినిమా టీమ్ హాజరై అలరించారు. Photo : Twitter
ఇక తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ లేటెస్ట్ ఎపిసోడ్లో ఎఫ్ 3 నటులు హీరోయిన్ తమన్నా, సోనాల్ చౌహాన్, సునీల్, డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఇక ఎప్పటిలాగే యాంకర్ సుమ తన మాటతీరుతో అందరిని అలరిస్తున్నారు. అయితే ఒక చోట మాత్రం మహేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాక్ అనే పాటకు తమన్నా ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేసింది అన్నారు. దీంతో వెంటనే హీరోయిన్ తమన్నా అందుకుని.. అయ్యో ఆ పాటలో నటించింది నేను కాదు రష్మిక అని సమాధానం చెప్పడంతో.. అందరూ నవ్వారు. ఇక ఈ ప్రోమోలో టీ అమ్మడం, చిన్నపిల్లలు చాక్లెట్ కోసం ఏ విధంగా మారం చేస్తారు వంటి స్కిట్స్ చేసి అందరిని నవ్వించారు సునీల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Photo : Twitter
Suma Kanakala : యాంకర్ సుమ (Anchor Suma) అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు. యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ (Suma Kanakala) తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. Photo : Twitter
తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) అంటూ వచ్చిన ఈ సినిమాలో తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో సుమ (Anchor Suma) ప్రధాన పాత్రలో కనిపించారు. మంచి అంచనాల నడుమా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాగానే అలరిస్తోంది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే సుమకు అన్యాయం జరిగిందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. సుమ ప్రధాన పాత్రలో శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన జయమ్మ పంచాయితీ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి థియేటర్ల విషయంలో సుమకు అన్యాయం జరిగిందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. వివరాల్లోకి వెళితే.. నిన్న ఒక్కరోజే మూడు తెలుగు సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. Photo : Twitter
యాంకర్ సుమ జయమ్మ పంచాయితీ సినిమాతో పాటు విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం, శ్రీ విష్ణు భళా తందనాన సినిమాలు విడుదలైయ్యాయి. వీటికి తోడు ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్, కెజియఫ్ సినిమాలకు ఇంకా మంచి ఆదరణ ఉండడంతో సుమ సినిమాకు థియేటర్లు దక్కలేదు. ఈ క్రమంలో పరిమిత సంఖ్యలో సుమ జయమ్మ పంచాయితీ సినిమాకు షోస్ దక్కాయి. దీంతో ఒక విధంగా సుమ సినిమాకు అన్యాయం జరిగిందని, నెటిజన్స్‌తో పాటు ఆమె ఫ్యాన్స్ మండి పడుతున్నారు. సినిమా ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైతే కలెక్షన్స్ బాగా వచ్చేవని కామెంట్స్ చేస్తున్నారు. Photo : Twitter
ఇక సుమ యాంకరింగ్ విషయానికి వస్తే.. యాంకర్ సుమ (Anchor Suma)అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు. సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు. యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ (Suma Kanakala) తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. Photo : Twitter
దశాబ్ధాలుగా ఈమె టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ సమీప భవిష్యత్తులో ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏదైనా ఈవెంట్ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ (Suma Kanakala) స్పెషాలిటీ. తెలుగు ప్రేక్షకులు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి. Photo : Twitter