తనదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూ బుల్లితెర రాములమ్మగా పాపులర్ అయింది శ్రీముఖి. మాటలతో మాయ చేయడంలో తనది ప్రత్యేకమైన దారి అని ప్రూవ్ చేసుకుంటూ టాప్ యాంకర్ గా ఎదిగింది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది బ్యూటీల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది.
2/ 9
అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ బాటలో శ్రీముఖి అందాలకు చిన్నతెరపై మంచి డిమాండ్ ఉంది. తమదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూనే గ్లామర్ వడ్డిస్తున్నారు ఈ యంగ్ లేడీస్. హీరోయిన్స్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదిస్తూ సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తున్నారు.
3/ 9
ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా శ్రీముఖి రెచ్చిపోతోంది. వరుసపెట్టి తన గ్లామర్ యాంగిల్స్ వదులుతూ అందాల గాలం వేస్తోంది. దీంతో సోషల్ మీడియా వేడెక్కిపోతోంది. ఇక తాజాగా ఓ బ్యూటిఫుల్ శారీ కట్టి కవ్వించింది శ్రీముఖి.
4/ 9
మొన్నటికి మొన్న కొండకోనల నడుమ బొడ్డు చూపిస్తూ అందాల విందు చేసిన ఈ బుల్లితెర రాములమ్మ.. ఇప్పుడు తన చిట్టి నడుము ఫోకస్ అయ్యేలా ఫోటో షూట్ చేసింది. నిండుగా శారీ కట్టి కేవలం నడుము అందం బయటపడేలా జాగ్రత్త పడింది. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.
5/ 9
అమ్మడి చురకత్తుల్లాంటి చూపులు కుర్రకారు గుండెలను గుచ్చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసి వావ్.. బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
6/ 9
తనదైన చలాకీతనంతో కుర్రకారు మనసు దోచుకున్న శ్రీముఖి.. బుల్లితెర అల్లరి పిల్లగా ఫేమస్ అయింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను కూడా వేడెక్కిస్తోంది శ్రీముఖి. ప్రతీ అప్ డేట్ కూడా అభిమానులతో పంచుకుంటోంది.
7/ 9
ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ దూసుకుపోతోంది శ్రీముఖి. ‘నేను శైలజ’ సినిమాలో చాక్లెట్ బాయ్ రామ్‌కు సిస్టర్ క్యారెక్టర్ చేసి అదరగొట్టింది శ్రీముఖి. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై అందివచ్చిన ప్రతి అవకాశంలో తన మార్క్ చూపించే ప్రయత్నాలు చేస్తోంది.
8/ 9
తన టాలెంట్ తో వచ్చిన ఫేమ్ శ్రీముఖికి బిగ్ బాస్ ఆఫర్ కూడా తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ తెలుగు 3 లో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి.. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై తెగ హంగామా చేస్తోంది. బుల్లితెర షోస్ తో పాటు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది.
9/ 9
గతేడాది క్రేజీ అంకుల్స్ అనే రొమాంటిక్ కథతో అలరించిన శ్రీముఖి.. ఆ తర్వాత నితిన్ హీరోగా వచ్చిన మాస్ట్రో సినిమా చేసింది. తన రోల్ కి ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ కెమెరా ముందు హవా నడిపిస్తోంది. అలాగే రెగ్యులర్ గా తన హాట్ డోస్ దట్టిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.