శ్రీముఖి ప్రస్తుతం టీవీలో ప్రముఖ యాంకర్లలో ఒకరు. అటు బుల్లితెరపై షోలు చేస్తూనే.. ఇటు సినిమాల్లో ఛాన్సులు కూడా కొట్టేస్తోంది శ్రీముఖి. తాజాగా చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్లో కూడా శ్రీముఖి నటిస్తోంది. శ్రీముఖి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ హల్ చల్ చేస్తుంటుంది.
గ్లామర్, యాక్టింగ్, హోస్టింగ్ ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో ఇటు సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తుంటుంది.
2/ 8
తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోల్లో శ్రీముఖి అదరగొట్టిందనే చెప్పాలి. క్యూట్ లుక్‌లో కేకపెట్టించింది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పిచ్ కలర్ డ్రెస్సులో శ్రీముఖి అందాల ఆరబోత మామూలుగా లేదు.
3/ 8
శ్రీముఖి షేర్ చేసిన తాజా ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్స్ ఆమె ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. మరో నెటిజన్ ఇంత సన్నగా ఎలా తయారయ్యారో వీడియో పెట్టండి అంటూ కామెంట్ చేశారు.
4/ 8
శ్రీముఖి ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆమె మెగాస్టార్ ప్రధాన పాత్రలో వస్తున్న భోళా శంకర్ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. భోళా శంకర్ విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే.
5/ 8
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.
6/ 8
మరోవైపు కొంత కాలంగా శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు తెలుగు రాష్ట్రాల్లో తెగ హాట్ టాపిక్ అవుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ బ్యూటీ ఓ సింగర్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీముఖి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
7/ 8
శ్రీముఖి ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. 'జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్మెన్' వంటి చిత్రాల్లో అదిరిపోయే పాత్రలు చేసింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది.
8/ 8
ఓ వైపు సినిమాలు చేస్తూనే... మరోవైపు శ్రీముఖి యాంకర్‌గా మారింది. 'అదుర్స్' షోతో హోస్టుగా మారిన ఆమె.. ఆ తర్వాత 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు చేసింది.