బుల్లితెరపై ఉన్న మేల్ యాంకర్స్‌లో ప్రదీప్ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యాంకర్ రవి. ఇంకా చెప్పాలంటే మాస్ యాంకరింగ్ చేయాలంటే తెలుగులో మనోడు తప్ప మరో ఆప్షన్ లేదు. అంతగా ఆకట్టుకుంటున్నాడు రవి. ముఖ్యంగా తన అద్భుతమైన టైమింగ్‌తో పాటు మాటలతో మాయ చేస్తుంటాడు రవి. వరస షోలతో బిజీగా ఉన్న సమయంలోనే గతేడాది బిగ్ బాస్ 5 తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు రవి.
టైటిల్ ఫేవరెట్‌గా వచ్చినా కూడా అనుకోని విధంగా మధ్యలోనే బయటికి వచ్చేసాడు. 12వ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది. 19 మంది కంటెస్టెంట్లతో.. ఒక్కటంటే ఒక్క వైల్డ్ కార్డ్ కూడా లేకుండానే గతేడాది సీజన్ ముగించారు. ఉన్న వాళ్లతోనే సరిపెట్టేసారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే మొదటి నుంచి కూడా యాంకర్ రవికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు వచ్చినప్పటి నుంచి నామినేషన్స్‌లో ఉన్నా ఎప్పటికప్పుడు సేవ్ అవుతూనే ఉన్నాడు.
మంచి ఫాలోయింగ్ ఉన్న యాంకర్ కావడంతో.. మనోడికి కావాల్సినంత హైప్ కూడా వచ్చింది. కానీ అందర్నీ ప్రభావితం చేస్తుంటాడని.. గుంటనక్క అని.. కావాలనే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెడుతుంటాడని రవిపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే అవన్నీ ఆటలో భాగమే అని నాగార్జున కూడా చెప్పుకొచ్చాడు. ఇదిలా జరుగుతున్న సమయంలోనే ఫైనల్‌కు మూడు వారాల ముందు ఎలిమినేట్ అయ్యాడు రవి.
ఆయన ఎలిమినేషన్ ఫేక్ అంటూ.. అప్పట్లో ఇంట్లో ఉన్న ప్రియాంక సింగ్ కంటే రవికి ఓట్లు తక్కువ పడే ఛాన్సే లేదంటూ అభిమానులు అన్నపూర్ణ గేట్ ముందు గొడవ చేసారు కూడా. అయితే బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత బయటికి వచ్చి తన షోలు చేసుకుంటూ బిజీ అయిపోయాడు ఈయన. మధ్యలో కొన్ని సినిమా ఈవెంట్స్ కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ నుంచి యాంకర్ రవికి పిలుపు వచ్చింది.
మొదటిసారి తెలుగులో ఓటీటీ వెర్షన్ వస్తుంది. ఇందులో యాంకర్ రవి ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అలా కాదు.. మరోలా ఎంట్రీ ఇచ్చాడు రవి. ముందు నుంచీ ప్రచారం జరుగుతున్నట్లుగానే యాంకర్ రవికి బిగ్ బాస్ బజ్ హోస్ట్ చేసే ఆఫర్ ఇచ్చాడు. తనీష్, రాహుల్ సిప్లీగంజ్, ఆరియానా గ్లోరి లాంటి వాళ్లు హోస్ట్ చేసారు. అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మనోభావాలను అడిగి తెలుసుకునే ఇంటర్వ్యూలు ఇవి.
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ తొలి వారంలో వారియర్స్ టీమ్ కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. ఆమె బయటికి వచ్చిన వెంటనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'బిగ్ బాస్ బజ్' ఎపిసోడ్ ఎపిసోడ్ విడుదల చేసారు. అందులో యాంకర్ రవి హోస్టుగా ఉన్నాడు. మొత్తానికి అలా బిగ్ బాస్ యాంకర్ రవికి మరో ఆఫర్ ఇచ్చాడన్నమాట.