Anchor Lasya: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య.. ఎమోషనల్ పోస్ట్
Anchor Lasya: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య.. ఎమోషనల్ పోస్ట్
Lasya Manjunath: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లాస్య.. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. తమ కుటుంబంలోకి మరొకరిని ఆహ్వానిస్తున్నామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది యాంకర్ లాస్య.
బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం యాంకర్ లాస్య. ఒకానొక సమయంలో యాంకరింగ్ లో సరికొత్త ట్రెండ్ తీసుకొస్తూ చిన్నితెరపై తన మార్క్ చూపించిన లాస్య.. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రెండో సారి తల్లయింది లాస్య.
2/ 8
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లాస్య.. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. తమ కుటుంబంలోకి మరొకరిని ఆహ్వానిస్తున్నామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది యాంకర్ లాస్య. పుట్టింది మగబిడ్డ అని చెప్పింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
3/ 8
లాస్య మరోసారి తల్లయిందని తెలిసి ఆమె తోటి సెలబ్రెటీలంతా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా బెస్ట్ విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
4/ 8
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే లాస్య.. ఇటీవలే తన సీమంతం వేడుకల వీడియోలు, ఫొటోలు అభిమానులతో పంచుకోగా అవి బాగా వైరల్ అయ్యాయి. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు మెహబూబ్, దేత్తడి హారిక, గీతూ రాయల్ సహా పలువురు ఈ వేడుకలో సందడి చేశారు.
5/ 8
ఇంట్లో చెప్పకుండా మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది లాస్య. పెళ్లి చేసుకున్నాక ఈ ఇద్దరూ చాలా కష్టాలు అనుభవించారట. ఈ దంపతులకు అంతకుముందే జున్ను అనే ఓ కుమారుడు ఉండగా.. ఇప్పుడు వారి లైఫ్ లోకి రెండో కొడుకు వచ్చాడు.
6/ 8
యాంకర్ రవికి జోడిగా యాంకరింగ్ చేస్తూ ఒకప్పుడు బుల్లితెరపై తెగ హంగామా చేసింది లాస్య. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయింది. అయితే పర్సనల్ కారణాల వల్ల కొంతకాలం టీవీ షోలకు దూరమైన లాస్య.. బిగ్ బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) రియాలిటీషోలో పాల్గొని సందడి చేసింది.
7/ 8
బిగ్ బాస్ తెలుగు 4 లోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు బయటపెట్టింది లాస్య. తన కడుపులో బిడ్డని చంపుకున్న విషయాన్ని చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్‌ను మొదలు పెట్టి.. అక్కడ రకరకాల వీడియోలతో అలరిస్తోంది లాస్య.
8/ 8
2010లో పెళ్లి చేసుకున్న లాస్య.. ఆ సమయంలో పెద్దలు ఒప్పుకోకపోవడంతో భర్తతో కొన్నేళ్లు దూరంగానే ఉందట. ఆ తర్వాత 2012 నుంచి కలసి ఉంటున్నారు లాస్య మంజునాథ్. ఎన్నో కష్టాలు పది 2017లో అందరినీ ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నాము అని అప్పట్లో లాస్య చెప్పింది.