తన భర్త మంజునాథ్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన గురించి అద్భుతంగా వివరిస్తూ భావోద్వేగానికి గురైంది లాస్య. పర్ఫెక్ట్ హస్బెండ్ కి భార్య అయినందుకు గర్వపడుతున్నా అని పేర్కొంది. నా పిచ్చితనాన్ని భరించే ఏకైక వ్యక్తివి నువ్వే. హ్యాపీ బర్త్ డే మంజునాథ్. నువ్వు నన్ను నవ్వించావు. నా సక్సెస్ చూశావు. కష్టాల్లో ఉన్నప్పుడు నా పక్కనే ఉండి నిలబెట్టావు. నా కన్నీళ్లు తుడిచావు అని ఆమె తెలిపింది.